costume krishna:సినీయర్ నటుడు, నిర్మాత కస్ట్యూమ్ కృష్ణ (krishna) కన్నుమూశారు. గత కొంతకాలంగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఈ రోజు చెన్నైలో (chennai) గల స్వగృహంలో తుదిశ్వాస విడిచారు.
కృష్ణ (krishna) స్వస్థలం విజయనగరం (vijayanagaram) జిల్లా. కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన ‘భారత్ బంద్’ (bharath bandh) సినిమాతో నటుడిగా పరిచయం అయ్యారు. పెళ్లి పందిరి (pelli pandiri) మూవీలో నటించడమే కాకుండా నిర్మించారు. పెళ్లాం చేబితే వినాలి, అల్లరి మొగుడు, దేవుళ్లు, మా ఆయన బంగారం, విలన్, పుట్టింటికి రా చెల్లి సినిమాల్లో నటించారు.
ఆయన ఎక్కువ శాతం నెగిటివ్ షెడ్స్ ఉన్న మూవీస్ చేశారు. విలన్‌గానే గుర్తింపు పొందారు. కృష్ణ మృతిపై పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆ భగవంతుడిని కోరారు.