ఇటలీ యొక్క డేటా ప్రొటెక్షన్ అథారిటీ నుంచి ChatGPT తమ వినియోగదారుల డేటాను దొంగిలించిందని ఆరోపించింది. అంతేకాకుండా మైనర్లు అక్రమ విషయాలకు గురికాకుండా నిరోధించడానికి చాట్‌జిపిటికి వయస్సు నిర్ధారణ వ్యవస్థ లేదని చెప్పింది. దీంతో గోప్యతా సమస్యలపై ChatGPTని నిషేధించిన మొదటి దేశంగా ఇటలీ అవతరించింది.
అత్యంత జనాదరణ పొందిన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ చాట్‌బాట్ ChatGPTని నిషేధిస్తున్నట్లు ఇటలీ పేర్కొంది. గోప్యతా సమస్యలను ఉల్లంగించిన నేపథ్యంలో OpenAI యొక్క ChatGPT చాట్‌బాట్‌పై దర్యాప్తు ప్రారంభించినట్లు ఇటలీ డేటా రక్షణ కార్యాలయం తెలిపింది. మరోవైపు ఇటాలియన్ వినియోగదారుల ప్రైవేట్ సమాచారం విషయంలో చాట్బాట్ల వినియోగాన్ని తాత్కాలికంగా బ్లాక్ చేసినట్లు తెలుస్తోంది. గత వారం సంభవించిన డేటా ఉల్లంఘన కారణంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
13 ఏళ్లు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న వారికి మాత్రమే ఈ సేవ అందుబాటులో ఉండాలని తెలిపింది. కానీ వినియోగదారుల వయస్సును ధృవీకరించడంలో విఫలమైనందుకు ChatGPTకి ఛార్జీ కూడా విధించింది. వినియోగదారుల వయస్సు ధృవీకరణ కోసం ఎటువంటి ఫిల్టర్ లేకపోవడంపై గోప్యతా వాచ్డాగ్ ను అలర్ట్ చేసింది. ఇది పిల్లల ద్వారా పూర్తిగా అనుచితమైన ప్రత్యుత్తరాలకు దారి తీసే అవకాశం ఉందని ఇటలీ ఏజెన్సీ హెచ్చరించింది.
గత కొన్ని నెలల్లో కృత్రిమ మేధస్సు (AI) సాంకేతిక ప్రపంచంలో ChatGPT ఆధిపత్యం చెలాయించింది. మరోవైపు మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ చాట్‌జిపిటిని 40 ఏళ్లలో అత్యంత “విప్లవాత్మక” సాంకేతికతగా పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రపంచవ్యాప్తంగా ChatGPTకి ప్రజాదరణ పెరింగింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఈ AI టెక్నాలజీకి ఇప్పుడు పెద్ద ఎదురుదెబ్బ తగిలిందని చెప్పవచ్చు. ఈ క్రమంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టూల్‌ను ప్రభుత్వం బ్లాక్ చేసిన మొదటి దేశంగా ఇటలీ నిలిచింది.
దీనిపై స్పందించిన ChatGPT వ్యవస్థాపకుడు సామ్ ఆల్ట్మాన్ ఇటలీ తనకు ఇష్టమైన దేశాలలో ఒకటి అని పేర్కొన్నారు. తాము అన్ని గోప్యతా చట్టాలను అనుసరిస్తున్నామని భావిస్తున్నట్లు ఆయన చెప్పారు. అయితే ఇటలీలో తమ కంపెనీ గురించి అదనపు సమాచారాన్ని అందించే వరకు ChatGPTకి యాక్సెస్‌ను నిరోధించినట్లు తెలిపారు.