»Rtc Runs Additional Services To Uppal For Ipl Match
HYDకి ఐపీఎల్ ఫీవర్.. అదనపు బస్సులు, మెట్రో కూడా
మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ ఢీ కొనబోతుంది. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుండగా.. మెట్రో కూడా అదనపు సర్వీసులు వేసింది.
Rtc runs additional services to uppal for IPL match
Rtc additional Buses:మరికొన్ని గంటల్లో ఉప్పల్ వేదికగా రాజస్థాన్ రాయల్స్ జట్టుతో సన్ రైజర్స్ హైదరాబాద్ (SRH) ఢీ కొనబోతుంది. ఇప్పటికే క్రికెట్ అభిమానులు ఉప్పల్ స్టేడియం (Uppal stadium) పరిసరాలకు చేరుకున్నారు. అభిమానుల కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సలు (rtc special buses) నడపనుండగా.. మెట్రో (metro) కూడా అదనపు సర్వీసులు వేసింది. మధ్యాహ్నం 3:30 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఐపీఎల్ మ్యాచ్ జరగనున్న సంగతి తెలిసిందే.
సిటీ శివార్ల నుంచి ఉప్పల్ వరకు ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుంది. సాయంత్రం వరకు ఉప్పల్‌కు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసినట్లు ఆర్టీసీ అధికారులు తెలిపారు. మధ్యాహ్నం 12:20 గంటల నుంచి సర్వీసులు పెంచుతామని మెట్రో రైల్ కూడా ప్రకటించింది. ప్రతి రెండు, మూడు నిమిషాలకు ఒక మెట్రో రైలు ఉప్పల్ వైపు పరుగులు తీస్తుందని పేర్కొంది.
సన్ రైజర్స్ (SUN RISERS) హైదరాబాద్ జట్టుకు షాక్ తగిలింది. ఫస్ట్ మ్యాచ్‌కు సన్ రైజర్స్ కెప్టెన్ (Captain) మార్క్ రమ్, పేసర్ మార్కో జాన్సెన్, క్లాసెన్ అందుబాటులో ఉండటం లేదు. ఈ ముగ్గురు సౌతాప్రికా ప్లేయర్స్ కాగా.. నెదర్లాండ్స్ వన్డే సిరీస్ కోసం వీరు రావడం లేదు. దీంతో టీమిండియా వెటరన్ సీమర్ భువనేశ్వర్ కుమార్ (bhuvaneshwar kumar) జట్టుకు నాయకత్వం వహిస్తాడు. ఏప్రిల్ 7వ తేదీన లక్నో సూపర్ జెయింట్స్‌తో జరిగే మ్యాచ్‌కు మాత్రం ఈ ముగ్గురు అందుబాటులో ఉంటారు.