»Ys Sharmila Phone To Revanth Reddy And Bandi Sanjay
Pragathi bhavan మార్చ్‌కు షర్మిల పిలుపు.. రేవంత్, బండికి ఫోన్
ప్రగతి భవన్ మార్చ్‌కు వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు పార్టీ అధినేతలకు ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి వైఎస్ షర్మిల ఫోన్ చేశారు.
YS Sharmila phone to Revanth reddy and Bandi sanjay
YS Sharmila call to Revanth, Bandi sanjay:ప్రగతి భవన్ మార్చ్‌కు (pragathi bhavan) వైఎస్ఆర్ టీపీ చీఫ్ వైఎస్ షర్మిల (YS Sharmila) పిలుపునిచ్చారు. ప్రతిపక్షాల మద్దతు కూడగట్టేందుకు ఈ రోజు పార్టీ అధినేతలకు ఫోన్ చేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ (bandi sanjay), పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి (revanth reddy) వైఎస్ షర్మిల (YS Sharmila) ఫోన్ చేశారు. నిరుద్యోగుల సమస్యపై కలిసి పోరాడదాం అని వైఎస్ షర్మిల (YS Sharmila) కోరారు. ఉమ్మడి కార్యాచరణ సిద్ధం చెద్దామని వారితో షర్మిల (YS Sharmila) చెప్పారు. సీఎం కేసీఆర్ (kcr) మెడలు వంచాలంటే ప్రతిపక్షాలు ఏకం కావాల్సిన అవసరం ఉందన్నారు. కలిసి పోరాడకుంటే ప్రతిపక్షాలను రాష్ట్రంలో కేసీఆర్ (kcr) బ్రతకనివ్వడని హాట్ కామెంట్స్ చేశారు.
కలిసి పోరాటం చేసేందుకు బండి సంజయ్ (bandi sanjay) మద్దతు తెలిపారు. దీనికి సంబంధించి త్వరలో సమావేశం అవుదామని ఆయన చెప్పారట. నిరుద్యోగుల విషయంలో ఉమ్మడి పోరాటానికి పూర్తి మద్దతు ఉంటుందని స్పష్టంచేశారని షర్మిల (sharmila) తెలిపారు. ప్రతిపక్షాలు కలిసి పోరాటం చేయాల్సిన సమయం ఏర్పడిందని టీపీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (revanth reddy) అన్నారట. షర్మిల (YS Sharmila) చెప్పిన అంశానికి సంబంధించి పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని రేవంత్ రెడ్డి (YS Sharmila) తనతో చెప్పారని షర్మిల (YS Sharmila) వివరించారు.
గత కొంతకాలంగా షర్మిల (YS Sharmila) నిరుద్యోగ సమస్యను ప్రస్తావిస్తూ వస్తున్నారు. రాష్ట్రంలో కొలువుల నియామకాలు సరిగా జరగడం లేదని ప్రతీ మంగళవారం నిరుద్యోగ నిరాహార దీక్ష కూడా చేపట్టారు. నిరుద్యోగులకు తాము వెన్నంటే ఉంటామని ముందునుండి చెబుతున్నారు. ఇప్పుడు ప్రతిపక్షాల మద్దతు కూడగట్టి.. కలిసి పోరాటం చేస్తామని చెబుతున్నారు.