Coronavirus:దేశంలో కరోనా కేసులు (corona cases) క్రమంగా పెరుగుతున్నాయి. రోజు రోజుకు కేసుల పెరుగుదల కనిపిస్తోంది. గత 24 గంటల్లో3824 పాజిటివ్ కేసులు (cases) వచ్చాయని కేంద్ర వైద్యారోగ్య శాఖ తెలిపింది. ఈ ఏడాది ఇవే అత్యధిక కేసులు అని పేర్కొంది. దీంతో జనవరి నుంచి వచ్చిన కేసుల సంఖ్య 18 వేల 389కి చేరింది.
యాక్టివ్ (active cases) కేసుల సంఖ్య 0.04 శాతంగా ఉంది. రికవరీ రేటు 98.77 శాతంగా ఉండటం సానుకూల అంశంగా మారింది. గత 24 గంటల్లో కరోనాతో నలుగురు (4 people) చనిపోయారు. ఢిల్లీ (delhi), హర్యానా (haryana), కేరళ (kerala), రాజస్థాన్‌లో (rajasthan) ఒక్కొక్కరు చొప్పున మృతిచెందారు.
కరోనా కేసుల పెరుగుదల నేపథ్యంలో ఆస్పత్రులలో ఫేస్ మాస్క్ (mask) తప్పనిసరిగా ధరించాలని తమిళనాడు ప్రభుత్వం (tamilnadu government) ఆదేశాలు జారీచేసింది. ఇటు కేంద్ర ప్రభుత్వం కరోనా పరీక్షలు.. అలాగే వ్యాక్సినేషన్ కార్యక్రమం పెంచాలని స్పష్టంచేసింది. ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఫ్రంట్ లైన్ వర్కర్స్, ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల సిబ్బంది అలర్ట్‌గా ఉండాలని యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది. రాష్ట్రంలో చేసిన శాంపిల్స్ అన్ని జినొమ్ సీక్వెన్సింగ్‌కు పంపిస్తున్నామని పేర్కొంది.
కరోనా వ్యాక్సిన్ దేశంలో దాదాపు అందరూ తీసుకున్నారు. సెకండ్.. బూస్టర్ డోసు తీసుకోని వారు.. టీకా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం కోరుతుంది. ఇటు ఇన్ ఫ్లూయెంజా వైరస్ థ్రెట్ కూడా ఉంది. ఇప్పటికీ తెలుగు రాష్ట్రాల్లో కేసులు నమోదు కాలేదు.