»Stormy Daniels Scared About Trump Go To Violence In Usa
Trump హింసకు పాల్పడతారు.. హుస్ మనీ కేసులో నేరారోపణ నేపథ్యంలో డేనియల్
అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హుష్ మనీ చెల్లింపుల కేసు నేరారోపణ రుజువు అయ్యింది. దీంతో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో ట్రంప్ దోషిగా తేలినా.. తేలకున్న హింసకు దారితీస్తుందని చెప్పారు.
Stormy Daniels scared about trump go to violence in usa
Stormy Daniels:అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ (donald trump) హుష్ మనీ చెల్లింపుల కేసు నేరారోపణ రుజువు అయ్యింది. దీంతో పోర్న్ స్టార్ స్టార్మీ డేనియల్స్ (Stormy Daniels) భయాందోళనకు గురయ్యారు. ఈ కేసులో ట్రంప్ (trump) దోషిగా తేలినా.. తేలకున్న హింసకు దారితీస్తుందని చెప్పారు. కొందరు గాయపడొచ్చు.. మరికొందరు చనిపోవచ్చు అని భయంతో చెప్పారు. ఈ కేసులో తీర్పు ప్రజలను వీడదీసి.. వారి చేతల్లోకి ఆయుధాలు తీసుకొచ్చే అవకాశం ఉందన్నారు. 2021 జనవరి 6వ తేదీన జరిగిన యుఎస్ క్యాపిటల్ హిల్ (us capital hill) అల్లర్లను గుర్తుచేశారు. ట్రంప్ ఇప్పటికే అల్లర్లను ప్రేరేపించి.. ప్రాణ నష్టం జరిగేందుకు కారణం అయ్యాడు అని గుర్తుచేశారు. కష్ట సమయంలో తనకు సపోర్ట్ చేసిన ప్రతీ ఒక్కరికీ డేనియల్స్ ధన్యవాదాలు తెలిపారు. తనపై చూపిన ప్రేమ, అభిమానాలను థాంక్స్ చెబుతూ ట్వీట్ చేశారు.
ట్రంప్ (trump) లాయర్ జో టాకోపినా మాట్లాడుతూ.. వచ్చే వారం మ్యాన్ హట్టన్ డిస్ట్రిక్ట్ అటార్నీ వద్దకు ట్రంప్ వచ్చే అవకాశం ఉందన్నారు. ఇప్పటికే తమ లీగల్ టీమ్ ప్రాసిక్యూటర్‌తో టచ్‌లో ఉందని తెలిపారు. నెక్ట్స్ వీక్ విచారణ కూడా జరుగుతుందని పేర్కొన్నారు.
2006లో ట్రంప్ తనతో శృంగారంలో పాల్గొన్నారని డేనియల్స్ (Stormy Daniels) ఆరోపించారు. ఈ విషయం బయటపెట్టకుండా ఉండేందుకు ట్రంప్ అడ్వకేట్ తనకు రూ.1.30 లక్సల డాలర్లు ఇచ్చారని ఆరోపించారు. దీనికి సంబంధించి న్యూయార్క్ గ్రాండ్ జ్యూరీ ట్రంప్‌పై అభియోగాలు మోపింది. ఆ అభియోగాలు రుజువు కావడంతో నేరారోపణ రుజువైన తొలి మాజీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ (trump) నిలిచారు. అభియోగాలకు సంబంధించిన చార్జీలను మ్యాన్ హట్టన్ జిల్లా అటార్నీ ఆఫీసు సీల్డ్ కవర్లో ఉంచింది.
2006లో జరిగిన కేసుకు సంబంధించి.. 2016 అమెరికా అధ్యక్ష ఎన్నికలకు ముందు చర్చ వచ్చింది. విషయం బయటకు రావొద్దని ట్రంప్ లాయర్ డేనియల్స్‌కు (Stormy Daniels) నగదు ముట్టజెప్పారు. తర్వాత ట్రంప్ లీగల్ టీమ్‌లోనే సభ్యుడు డేనియల్స్ (Stormy Daniels) ఆరోపణలు నిజం అని చెప్పారు. లాయర్ కోహెన్ ముందుగా డబ్బులు ఇవ్వగా.. తర్వాత ట్రంప్ అందజేశారని మరో లాయర్ రూడీ గియూలియానీ చెప్పారు. రికార్డుల్లో మాత్రం దీనిని లీగల్ ఫీజు కింద చెల్లించానని చెప్పారని ఉంది.
డేనియల్స్ (Stormy Daniels) కేసు విచారణ గత ఐదేళ్లుగా కొనసాగుతోంది. ఇదేకాదు ట్రంప్‌పై చాలా కేసులు ఉన్న సంగతి తెలిసిందే. ఏ కేసులో నేరం రుజువు కాలేదు. ఇందులో మాత్రం నేరారోపణ జరగడంతో ట్రంప్ రాజకీయ భవిష్యత్ ప్రశ్నార్థకం కానుంది. 2024 అమెరికా ఎన్నికలకు ట్రంప్ సిద్దం అవుతుండగా.. డేనియల్స్ కేసు ఇబ్బంది కలిగించే అవకాశం ఉంది. ఎన్నికలకు ప్రచారం చేస్తానని ట్రంప్ అంటున్నారు. ఈ కేసు ముమ్మాటికీ రాజకీయ కక్షేనని అంటున్నారు. తనంటే గిట్టనివారు ఇలా చేస్తున్నారని పేర్కొన్నారు.