»Indian Family Among 8 Dead In Attempt To Enter Usa
Indian family సహా 8 మంది మృతి.. కెనడా నుంచి అక్రమంగా అమెరికాకు వెళ్తూ..
కెనడా నుంచి అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించి 8 మంది చనిపోయారు. భారత్, రొమానియాకు చెందిన రెండు కుటుంబాలు కెనడా నుంచి అమెరికాకు బోటులో వెళ్లేందుకు ప్రయత్నించారు. బోటు సెయింట్ లారెన్స్ నదిలో మునిగిపోవడంతో చనిపోయారు.
Indian family among 8 dead in attempt to enter USA
Indian family dead:కెనడా (canada) నుంచి అక్రమంగా అమెరికా (america) వెళ్లేందుకు ప్రయత్నించి 8 మంది (8 people) చనిపోయారు. మరొకరి ఆచూకీ కోసం గాలిస్తున్నారు. భారత్ (india), రొమానియాకు (romania) చెందిన రెండు కుటుంబాలు బుధవారం రాత్రి కెనడా (canada) నుంచి అమెరికాకు (america) బోటులో (boat) వెళ్లేందుకు ప్రయత్నించారు. వారి బోటు సెయింట్ లారెన్స్ నదిలో మునిగిపోయింది. దీంతో అందులో ఉన్న వారంతా చనిపోయారు. ఇప్పటివరకు 8 మృతదేహాలను వెలికి తీశారు. వీరిలో ఆరుగురు పెద్దలు.. ఇద్దరు చిన్నారులు ఉన్నారు.
సెయింట్ లారెన్స్ నది తీరంలో గల మార్షి ప్రాంతంలో గురువారం మృతదేహాలు కనిపించాయి. ఇదీ కెనడా- అమెరికా (america) సరిహద్దు ప్రాంతం.. వారు బోర్డర్ దాటేందుకు ప్రయత్నించి.. బోటు మునగడంతో చనిపోయారని అధికారులు చెబుతున్నారు. గురువారం ఆరు మృతదేహాలను నది నుంచి వెలికితీశారు. ఆ తర్వాత మరో రెండు డెడ్ బాడీస్ తీశారు. ఓ చిన్నారి (infant) వయస్సు మూడేళ్లు అని.. కెనడా పాస్ పోర్టు (canada passport) కూడా ఉందని చెప్పారు. మరో చిన్నారి కూడా కెనడా సిటిజన్ (canada) అని అధికారులు తెలిపారు.
ఘటనపై కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో (Justin Trudeau) స్పందించారు. ఘటన గురించి విని షాక్‌నకు గురయ్యానని తెలిపారు. ఏం జరిగిందో తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఇలాంటి ఘటన మరొకటి జరగకూడదని ఆయన అన్నారు.
అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ (joe biden)- జస్టిన్ ట్రూడో మధ్య అక్రమంగా అగ్రరాజ్యంలో ప్రవేశించే అంశానికి సంబంధించి గతవారం ఒప్పందం జరిగిన సంగతి తెలిసిందే. కానీ కొందరు అక్రమంగా ప్రవేశిస్తున్నారు. ఇలా భారతీయ- రొమానియాకు చెందిన రెండు కుటుంబాలు ప్రయత్నించి.. తిరిగిరానీ లోకాలకు వెళ్లిపోయారు.