»Ysrcp Goons Attacked On Telugu Desam Party Karyakartas In Puttaparthi
Puttaparthiలో వైసీపీ దౌర్జన్యకాండ.. టీడీపీ నాయకులపై దాడి
నిన్న బీజేపీ నాయకుడు సత్య కుమార్ పై దాడి చేయగా.. తాజాగా నేడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై దాడికి ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకుల కార్లపై వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు.
ఆంధ్రప్రదేశ్ లో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP) ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. నిన్న బీజేపీ నాయకుడు సత్య కుమార్ పై దాడి చేయగా.. తాజాగా నేడు మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డిపై (Palle Raghunatha Reddy) దాడికి ప్రయత్నించింది. తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) నాయకుల కార్లపై వైసీపీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. పుట్టపర్తి ఎమ్మెల్యేను ‘దోపిడీకుంట శ్రీధర్ రెడ్డి’ అంటూ టీడీపీ తీవ్ర ఆరోపణలు చేయడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు రెచ్చిపోయారు. ఇదే విషయమై సవాళ్లు కొనసాగడంతో శనివారం ప్రమాణానికి సిద్ధమవడంతో పుట్టపర్తిలో తీవ్ర ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
శ్రీసత్యసాయి జిల్లా (Sri Sathya Sai District) పుట్టపర్తి నియోజకవర్గంలో (Puttaparthi) ఎమ్మెల్యే దుద్దికుంట శ్రీధర్ రెడ్డి (Duddukunta Sreedhar Reddy) తీవ్ర అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఇసుక దోపిడీ, భూముల కబ్జాకు పాల్పడుతున్నారని ఆరోపణలు భారీగా వినిపిస్తున్నాయి. ఇదే విషయాన్ని యువగళం పాదయాత్రలో నారా లోకేశ్ (Nara Lokesh) ప్రస్తావించారు. దీనిపై ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. ‘నేను ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సత్తెమ్మ ఆలయంలో ప్రమాణానికి సిద్ధం’ ఎమ్మెల్యే ప్రకటించాడు. ఈ క్రమంలోనే పుట్టపర్తిలోని సత్తెమ్మ ఆలయానికి శనివారం ఎమ్మెల్యే వచ్చాడు. ఎమ్మెల్యే అవినీతి, దోపిడీని నిరూపిస్తానని మాజీ మంత్రి పల్లె రఘునాథ్ రెడ్డి కూడా ఆలయానికి బయల్దేరాడు. దీంతో స్థానికంగా ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి.
తెలుగుదేశం కార్యకర్తలు, నాయకులు బయటకు రావడంతో వైసీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. రాళ్లు, చెప్పులతో దాడులకు తెగబడ్డారు. అనంతరం తెలుగుదేశం పార్టీ నాయకుల కార్లను వైసీపీ నాయకులు ధ్వంసం చేశారు. పోలీసులు చూస్తుండగానే ఈ దాడులు కొనసాగాయి. దీనిపై తెలుగు తమ్ముళ్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పోలీసుల తీరుపై రఘునాథ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపై ధర్నాకు దిగారు. పోలీసులు వెంటనే చేరుకుని అతడిని అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించారు.