»With 6 Palaces And 16 Companies How Jagan Is Poor Kollu Ravindra Qestioned
Jagan Poor 6 భవనాలు, 16 కంపెనీలు ఉన్న జగన్ ఎలా పేదవాడు? కొల్లు రవీంద్ర నిలదీత
సొంత బాబాయ్ వైఎస్ వివేకపై గొడ్డలి వేటు వేయించడం, హంతకుల్ని కాపాడడం, తండ్రి ఆస్తిలో న్యాయమైన వాటా అడిగిన చెల్లిని, తల్లిని తరిమేయడం పెత్తనం కాదా? ఎంపీ రఘురామకృష్ణరాజును వేధించడం.. దాన్ని వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందడం వంటి జగన్ కు అలవాటు.
విలాసవంతమైన భవంతులు, భారీ కంపెనీలు ఉన్న సీఎం జగన్ (Jagan) పేదవాడా? అని తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) సీనియర్ నాయకుడు, మాజీ మంత్రి కొల్లు రవీంద్ర (Kollu Ravindra) ప్రశ్నించారు. రూ.లక్షల కోట్లు ఎలా సంపాదించారని నిలదీశారు. ఆస్తిలో వాటా అడగడంతోనే తల్లి, చెల్లిని తెలంగాణకు పంపించాడని ఆరోపించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. ఈ మేరకు మచిలీపట్నంలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.
‘జగన్ కు ఆరు భవనాలు (Palaces), భారతీ సిమెంట్స్, సండూర్ పవర్స్, సాక్షి వంటి 16 భారీ కంపెనీలు ఉన్న సీఎం జగన్ ఎలా పేదవాడు (Poor) అవుతాడు? 2004లో రూ.1.73 కోట్ల ఆస్తితో.. ఉన్న ఇల్లు కూడా అమ్ముకోవడానికి సిద్ధమైన జగన్ అతి తక్కువ సమయంలోనే రూ.లక్షల కోట్లు సంపాదించడం పెత్తందారీతనం కాదా?’ అని రవీంద్ర నిలదీశారు. ‘సొంత బాబాయ్ వైఎస్ వివేకపై (YS Vivekananda Reddy) గొడ్డలి వేటు వేయించడం, హంతకుల్ని కాపాడడం, తండ్రి ఆస్తిలో న్యాయమైన వాటా అడిగిన చెల్లిని, తల్లిని తరిమేయడం పెత్తనం కాదా? ఎంపీ రఘురామకృష్ణరాజును వేధించడం.. దాన్ని వీడియో తీయించి పైశాచిక ఆనందం పొందడం వంటి జగన్ కు అలవాటు. ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నించిన వారిపై అక్రమ కేసులు (Fake Case) బనాయించడం, ప్రతిపక్ష పార్టీల కార్యాలయం కూల్చేయడం వంటివి జగన్ కే చెల్లు. ప్రభుత్వ ప్రకటనల్లో మంత్రుల ఫొటోలు తీసేసి తన ఒక్క ఫొటో మాత్రమే వేసుకోవడం ఇవన్నీ పెత్తందారీతనం కాదా?’ అని రవీంద్ర ప్రశ్నించారు.
రాజధాని అమరావతి (Amaravati) విషయమై ప్రస్తావిస్తూ.. ‘రాష్ట్రంలోని అన్ని పార్టీలు, హైకోర్టు, కేంద్ర ప్రభుత్వం అమరావతిని రాజధానిగా గుర్తించినా జగన్ నిర్వీర్యం చేశారు. తీర్మానాలు లేకుండా స్థానిక సంస్థల నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించారు’ అని రవీంద్ర ఆరోపించారు. తన దోపిడీ (Extortion) లక్షణాలను ఎదుటివారికి అంటగట్టడం జగన్ నైజం అని పేర్కొన్నారు. జగన్ పై 40 క్రిమినల్ కేసులు (Criminal Case) ఉంటే.. వాటిలో 24 కేసులు 420 కేసులే. జగన్ ను మించిన పెత్తందారు, దోపిడీదారు దేశంలో ఎవరు లేరు. దోచుకో, పంచుకో, తినుకో అనే పేటెంట్ జగన్ దే’ అని కొల్లు రవీంద్ర తెలిపారు. జగన్ అధికారంలోకి అవినీతి (Corruption) పెరిగిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు.