తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party) మహానాడు కార్యక్రమంపై ఏపీ మంత్రి జోగి రమేశ్ (Jogi Ramesh) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఆ పార్టీ అధినేత చంద్రబాబును (Chandrababu) సభా వేదికపైన సమాధి చేస్తారని తెలిపారు. ఎన్టీఆర్ (NT Rama Rao) బతికి వస్తే అదే జరుగుతుందని పేర్కొన్నారు. రాజమండ్రిలో జరుగుతున్న టీడీపీ మహానాడుపై ఆయన మండిపడ్డారు. విజయవాడలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ టీడీపీ నాయకుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘టీడీపీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ ఒక క్షణం మళ్లీ ప్రాణం (Live) పోస్తే వెన్నుపోటు పొడిచిన చంద్రబాబును మహానాడు (Mahanadu) వేదికపై సమాధి చేస్తాడు. ఎన్టీఆర్ ను దేవుడిని అని కీర్తిస్తున్న వారే అప్పట్లో చెప్పులు, చిత్రవధ చేసి చంపారు. అలాంటి వ్యక్తులు ఇప్పుడు శతజయంతి పేరుతో వాళ్లే దండలు వేసి దండాలు పెడుతున్నారు’ అని జోగి రమేశ్ తెలిపాడు. ‘అసలు మనుషులేనా మీరు?’ అని టీడీపీ నాయకులపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘బీసీలకు మేలు చేశానని బద్మాష్ బాబు చెబుతున్నాడు. ఎన్నికల (Elections) సమయంలోనే చంద్రబాబుకు బీసీలు గుర్తుకువస్తారు’ అని రమేశ్ తెలిపారు. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడిపై ధ్వజమెత్తారు. ‘అచ్చెన్నాయుడు (Atchannaidu) ఒక పనికి మాలినోడు. ఆయన పడుకోవడానికి ఒక సెంటు సరిపోదట. పందిలా ఉన్న అచ్చెన్నాయుడు పడుకోవడానికి ఒక ఊరు (Village) కూడా సరిపోదు. టీడీపీ నాయకులు ఒళ్లు బలిసి మాట్లాడుతున్నారు. ముసలోడికి దసరా పండుగ అన్నట్లు చంద్రబాబు వ్యవహారం ఉంది. ఎన్టీఆర్ ఆత్మను ఇప్పటికీ చంద్రబాబు, టీడీపీ నాయకులు చిత్రవధ చేస్తూనే ఉన్నారు’ అని జోగి రమేశ్ తెలిపారు.