ఆంధ్రప్రదేశ్(andhra pradesh)లోని శ్రీ సత్యసాయి జిల్లా(sri sathya sai district)లో ఆదివారం ఓ మహిళ(women) తన ఇద్దరు కుమార్తెలతో కలిసి చెరువులో దూకి బలవన్మరణం చేసుకుంది. ముదిగుబ్బ మండలం గడ్డంపల్లి తండా సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. విషయం తెలిసిన పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతోపాటు చెరువులో క్షుణ్ణంగా వెతికిన తర్వాత మృతదేహాలను బయటకు తీసి శవపరీక్ష నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. వారిని సుకన్య (35), ఆమె కుమార్తెలు దేవయాని (10), జస్మిత (9)గా గుర్తించారు. అయితే ఆ మహిళ తన పిల్లలతో కలిసి చెరువులో దూకిన ఘటనపై స్థానికుల నుంచి పోలీసులు కొంత సమాచారం సేకరించారు.
భర్తతో గొడవలు, ఇంటి సమస్యల కారణంగానే మహిళ, ఆమె కుమార్తెలతో ఈ దారుణానికి ఒడిగట్టినట్లు పోలీసులు(police) ప్రాథమిక విచారణలో వెల్లడించారు. సుకన్య భర్త గంగాధర్ ఆమెతో తరచూ గొడవపడేవాడని అందుకే ఇలా చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. అంతేకాదు ఇద్దరి మధ్య తీవ్ర వాగ్వాదం జరగడంతో ఆమె కుమార్తెలిద్దరితో సహా ఇంటి నుంచి వెళ్లిపోయిందని అక్కడి వారు చెప్పినట్లు సమాచారం.