SS: ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన “కోటి సంతకాల” కార్యక్రమానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని మాజీ మంత్రి ఉషశ్రీ చరణ్ అన్నారు. మంగళవారం సోమందేపల్లి మండలం నాగినాయన చెరువు, తుంగోడు గ్రామాలలో ఇంటింటికి తిరిగి ఆమె సంతకాలు సేకరించారు. ఈ కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.