జర్మనీ(Germany)కి యూట్యూబ్ ఫిట్నెస్ స్టార్, జోస్తెటిక్స్గా చిరపరిచితుడైన జో లిండ్నెర్ అనూరిజం వ్యాధి(Aneurysm disease)తో మృతి చెందాడు. 30 ఏళ్ల అతి చిన్న వయుసులోనే మరణించాడు. తాజాగా విషయన్ని ఆయన ప్రియురాలు ఇన్స్టాగ్రామ్ (Instagram) పోస్టు ద్వారా తెలిపింది. ఫిట్నెస్(Fitness)కు సంబంధించి క్రమం తప్పకుండా ట్రిక్స్, టిప్స్ చెప్పే జో లిండ్నెర్కు ఇన్స్టాగ్రామ్లో 8.5 మిలియన్లు, యూట్యూబ్లో 9.40 లక్షల మంది సబ్స్క్రైబర్లు (Subscribers) ఉన్నారు. లిండ్నెర్ ప్రియురాలు నిచా ఇన్స్టా పోస్టు ప్రకారం.. రక్తనాళాలు ఉబ్బడం (అనూరిజం) కారణంగా జో చనిపోయాడు.అనూరిజం అనేది రక్తనాళాల గోడలో బలహీనత కారణంగా రక్తనాళాలు ఉబ్బిపోతాయి.
లిండ్నెర్ బలమైన, ప్రపంచంలోనే అద్భుతమైన, నమ్మశక్యం కాని వ్యక్తిగా లిండ్నెర్ను ఆమె అభివర్ణించింది. ఆయనతో తాను కలిసి ఉన్నానని, తన కోసం నెక్లెస్ (necklace) కూడా తయారుచేయించాడని రాసుకొచ్చింది. తనకు మెడనొప్పిగా ఉందని మూడు రోజుల క్రితం చెప్పాడని అయితే, అప్పటికే ఆలస్యమైందని ఆవేదన వ్యక్తం చేసింది. కాగా, జూన్లో సహ యూట్యూబర్ బ్రాడ్లీ మార్టిన్
(Bradley Martin)కు ఇచ్చిన ఇంటర్వ్యూలో లిండ్నెర్ మాట్లాడుతూ తాను కండరాల వ్యాధితో బాధపడుతున్నట్టు చెప్పాడు.