అక్కినేని నాగచైతన్య, దర్శకుడు కార్తీక్ దండు కాంబోలో ‘NC-24’ అనే వర్కింగ్ టైటిల్‌తో సినిమా తెరకెక్కుతోంది. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్ పాత్రను మేకర్స్ రివీల్ చేశారు. ఇందులో నటి మీనాక్షి చౌదరి ‘దక్ష’గా కనిపించనున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు పోస్టర్ షేర్ చేశారు. కాగా, ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం శరవేగంగా జరుగుతోంది.