మారుతున్న వాతావరణం చెవి ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. చలి, తేమ, పొడి గాలి వంటివి చెవిలో ఇన్ఫెక్షన్లు ఏర్పడటానికి కారణం అవుతాయి. శీతాకాలంలో చల్లటి గాలి శ్వాసకోశ వ్యాధులను పెంచుతుంది. ఇది చెవిలో ద్రవం పేరుకుపోవడానికి దారితీస్తుంది. చెవిలో చికాకు కలిగించి, ఇన్ఫెక్షన్ల ప్రమాదాన్ని పెంచుతుంది. ఈ సమయంలో సైనస్, గొంతు ఇన్ఫెక్షన్లు కూడా పెరుగుతాయి.