బంకించంద్ర ఛటర్జీ ‘వందేమాతరం’ గేయాన్ని రచించి 150 ఏళ్లు పూర్తైన నేపథ్యంలో ఇవాళ దేశవ్యాప్తంగా జాతీయ గీతాలాపన జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రమంత్రి షెకావత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బంకించంద్ర కలెక్టర్గా ఉన్నప్పుడు ఆయన వాహనాన్ని క్రికెట్ ఆడుతున్న బ్రిటిషర్లు అడ్డుకున్నారని, ఆ ఘటనే ప్రేరణగా ఆయన వందేమాతరం రచించినట్లు పేర్కొన్నారు.