CTR: శాంతిపురం(M) రాళ్లబూదుగూరు పంచాయతీ రామేగానిపల్లిలో శుక్రవారం రాత్రి ఓ గ్రానైట్ లారీని గ్రామస్థులు అడ్డుకున్నారు. తమ గ్రామంలో అక్రమంగా క్వారీ నడుపుతున్నారని వారు ఆరోపించారు. భారీ వాహనాల రాకపోకలతో శ్మశానం రోడ్డు పూర్తిగా ధ్వంసం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. దీనిపై అధికారులు స్పందించాల్సి ఉంది.