NLR: DRC మీటింగ్లో సర్వేపల్లి ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పలు విషయాలను ప్రస్తావించారు. జిల్లాలో అనధికార సాగు కింద ఉన్న రైతులకు ఎరువులు ఇస్తున్నారా? వారిని రికార్డుల్లో నమోదు చేశారా? అని ప్రశ్నించారు. దీనిపై మొదట వ్యవసాయ శాఖ జేడీ నీళ్లు నమిలారు. అనధికార సాగుతో కలిపి 93 వేల మెట్రిక్ టన్నుల ఎరువులు కేటాయించామని జేడీ చెప్పారు.