ముంబైలో జరిగిన నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో అనంత్ అంబానీ(Anant Ambani), అతనికి కాబోయే భార్య రాధికా మర్చంట్(Radhika Merchant) కలిసి పాల్గొన్నారు. ముకేష్ అంబానీ కుమారుడు బ్లాక్ కలర్ సూట్ ధరించగా, రాధిక అద్భుతమైన నలుపు చీరను ధరించి ఫొటోలకు ఫోజులిచ్చారు. ఇది చూసిన పలువురు నెటిజన్లు అనేక రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
నీతా ముఖేష్ అంబానీ కల్చరల్ సెంటర్‌ను మార్చి 31, శుక్రవారం ముంబైలో ప్రారంభించారు. ఈ సందర్భంగా నీతా అంబానీ మనోహరమైన ప్రదర్శన ఇచ్చి అక్కడకు వచ్చిన వారికి షాక్ ఇచ్చింది. నారింజ, ఎరుపు షేడ్స్‌లో దుస్తులు ధరించి నృత్యకారులతో వేదికపైకి ఎక్కి, భక్తిగీతమైన ‘రఘు పతి రాఘవ రాజా రామ్’ బీట్లకు గంభీరంగా ప్రదర్శన ఇచ్చింది. నీతా అంబానీ శిక్షణ పొందిన భరతనాట్యం నృత్యకారిణి కావడంతో ఈజీగా నేర్చుకున్నారని పలువురు అంటున్నారు. ఈ కార్యక్రమానికి రజనీకాంత్, సల్మాన్ ఖాన్, అమీర్ ఖాన్, సూపర్ మోడల్ జిగి హడిద్, ప్రియాంక చోప్రా జోనాస్, నిక్ జోనాస్, రణ్వీర్ సింగ్, దీపికా పదుకొనే, సిద్ధార్థ్ మల్హోత్రా వంటి ప్రముఖులు హాజరయ్యారు.
ఈ లాంచ్ ఈవెంట్ కార్యక్రమానికి అనేక మంది సెలబ్రీటీలు వచ్చారు. కానీ మా కళ్ళు మాత్రం అనంత్ అంబానీ(Anant Ambani), రాధిక మర్చంట్(Radhika Merchant) వైపు వెళ్లాయి. ఈ వేడుకలో భాగంగా వీరిద్దరూ చాలా ప్రేమగా కనిపించారు. అనంత్, రాధిక కలిసి ఫొటోలకు ఫోజులిచ్చారు. రాధిక మర్చంట్ సిల్వర్ ఫ్లోరా వర్క్‌తో అద్భుతమైన నల్లటి చీర ధరించగా.. అనంత్ అంబానీ చక్కగా రూపొందించిన బంద్‌గాలా షేర్వానీ బ్లాక్ సూట్ వేసుకుని దర్జాగా వచ్చేశారు. అయితే వీరిద్దరు కలిసి నవ్వుతూ ఫొటోలకు ఫోజులిచ్చారు.
ఆ క్రమంలో అనంత్ అంబానీ చాలా లావుగా కనిపిస్తుండగా.. అతని పక్కన ఆమె సూట్ కాలేదని పలువురు నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. అంతేకాదు కొంతమంది నెటిజన్లు వీరిని ట్రోల్ చేయడం ప్రారంభించారు. ఒకరు డబ్బులు ఉంటే ఏదైనా సాధ్యమేనని (‘సబ్ పైసా కా కమల్ హై’) కామెంట్ చేయగా, మరొకరు ‘నవ్వు ఆపుకోలేరు’ అని వ్యాఖ్యలు చేశారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కోడుతుంది.
రిలయన్స్ ఇండస్ట్రీస్ చైర్మన్ ముఖేష్ అంబానీ, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ, రాధికా మర్చంట్ ఈ ఏడాది జనవరిలో నిశ్చితార్థం చేసుకున్నారు. ముంబయిలోని అనితిలా వారి కుటుంబ గృహంలో ఈ వేడుక జరిగింది. రాధిక మర్చంట్ పారిశ్రామికవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె.