పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు భారీగా పెంచి నరేంద్ర మోదీ ప్రజలపై గుదిబండ మోపుతున్నారని మండిపడ్డాయి. ఇప్పుడు టోల్ చార్జీలు కూడా పెంచి అన్నింటి ధరలు పెరగడానికి కారణమయ్యాడని ఆగ్రహం వ్యక్తం చేశాయి. అధిక ధరలతో సామాన్యుడు జీవించలేని పరిస్థితి అని ఆవేదన వ్యక్తం చేశాయి.
కెనడా నుంచి అక్రమంగా అమెరికా వెళ్లేందుకు ప్రయత్నించి 8 మంది చనిపోయారు. భారత్, రొమానియాకు చెందిన రెండు కుటుంబాలు కెనడా నుంచి అమెరికాకు బోటులో వెళ్లేందుకు ప్రయత్నించారు. బోటు సెయింట్ లారెన్స్ నదిలో మునిగిపోవడంతో చనిపోయారు.
జైల్లో ఉన్న ఖైదీతో బీజేపీ లేఖలు విడుదల చేసి రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశాయి. సుఖేశ్ ఆరోపణలన్నీ అవాస్తవమని కొట్టిపారేశాయి. ప్రజలను తప్పుదోవ పట్టించుకునేందుకు ఇలాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయని పేర్కొన్నాయి.
IPL ఆరంభం అదిరిపోయింది. డిఫెండింగ్ చాంపియన్ గుజరాత్ తొలి మ్యాచ్ ను సొంతం చేసుకుంది. సీఎస్కే తరఫున రుతురాజ్ గైక్వాడ్ చేసిన భారీ స్కోర్ వృథాగా మారింది. ఐపీఎల్ ఆరంభోత్సవంలో తమన్నా, రష్మిక మందాన్న, అర్జిత్ సింగ్ ప్రదర్శనలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.
తెలంగాణలో BRS పార్టీ భ్రష్టాచార్ రిశ్వత్ సర్కార్‌గా మారిందని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(jp nadda) శుక్రవారం పేర్కొన్నారు. 2014లో మిగులు రాష్ట్రంగా ఉన్న తెలంగాణ(telangana)ను..నేడు రూ.3.29 లక్షల కోట్ల అప్పుల్లో కూరుకుపోయేవిధంగా బీఆర్ఎస్(BRS) చేసిందని ఆరోపించారు. అలాంటి పార్టీకి రాష్ట్రంలో అధికారంలో కొనసాగే హక్కు లేదని నడ్డా అన్నారు. తెలంగాణ, ఏపీలో బీజేపీ జిల్లా కార్యాలయాలను వర్చువల్ విధాన...
ఏపీలోని అమరావతిని అతిపెద్ద రియల్ ఎస్టేట్ కుంభకోణంగా ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) అభివర్ణించారు. అక్కడ రైతులకు ఏమి మోసం జరగలేదని, వారంతా భూములు అమ్ముకున్నట్లు తెలిపారు. కానీ చంద్రబాబు(chandrababu naidu) బినామీల కోసమే ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు.
కర్ణాటక బెంగళూరు(bengaluru)లో సిటీ పార్కులో కూర్చున్న 19 ఏళ్ల యువతిని కారులోకి లాక్కుని వెళ్లి.. నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులోనే ఈ ఘటన మార్చి 25న జరుగగా..నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
తెలంగాణ ఎంసెట్(telangana eamcet 2023) పరీక్ష తేదీ షెడ్యూల్లో స్పల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. మే 7 నుంచి జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షను మే 12 నుంచి 14 వరకు నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే నీట్ యూజీ, tspsc ఎగ్జామ్స్ ఉన్న క్రమంలో వీటిని మార్పు చేశారు.
TSPSC ప్రశ్న పత్రాల లీకేజీ కేసులో టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి(revanth Reddy).. మంత్రి KTRపై కీలక వ్యాఖ్యలు చేశారు. మీకు రూ.100 కోట్లు ఇచ్చి ఏంతైనా తిట్టికోవచ్చా అంటూ ఎద్దేవా చేశారు. సినిమా కోసం రకుల్ సంతకం పెట్టినట్లు, సమంత వెబ్ సిరీస్ కోసం ఒప్పుకున్నట్లు కాదని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.
మీరు హైదరాబాద్ మెట్రో(hyderabad metro)లో తరచూ ప్రయాణిస్తారా? అయితే ఈ న్యూస్ మీరు చదవాల్సిందే. ఎందుకంటే రేపటి(ఏప్రిల్ 1) నుంచి L&T మెట్రో పలు ఆఫర్లతోపాటు రేట్లను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు రద్దీ సమయాల్లో ఆఫర్లు అమల్లో ఉండవని స్పష్టం చేసింది.
బాలీవుడ్ హీరోయిన్ పరిణీతి చోప్రా(Parineeti Chopra), ఆప్ ఎంపీ రాఘవ్ చద్దా(raghav chadha) త్వరలో పెళ్లి చేసుకోనున్నారని.. పరిణీతి సహనటుడు, గాయకుడు హార్డీ సంధు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఆమెకు విశ్శేస్ కూడా చెప్పినట్లు వెల్లడించారు. ఇటీవల వీరు ముంబయిలోని ఓ హోటల్లో కనిపించడంతో ఈ వార్తలు నిజమేనని ఇంకొంత మంది అంటున్నారు.
మీ ఉద్యమంలో న్యాయం ఉంది... మీ వైపే ధర్మం ఉంది. అందుకే ఆంక్షలు, వేధింపులు, సంకెళ్లను ఎదిరించి మీరు ముందుకు సాగుతున్నారు. అంతిమంగా గెలిచేది, నిలిచేది అమరావతే!’
మోడీని టార్గెట్ చేస్తూ ఆప్(AAP) పోస్టర్ వార్ ఉధృతం చేసింది. మోడీ హటావో, దేశ్ బచావో ప్రచారాన్ని ఆప్ ప్రారంభించిన వారం తర్వాత ఢిల్లీ(delhi)లో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా..తాజాగా అహ్మదాబాద్(ahmadabad)లో ఇదే అంశంపై ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అయితే పోస్టర్లతోపాటు పలువురు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని పోలీసులు అంటున్నారు.
ప్రత్యేక రాష్ట్రంగా అవతరించిన అనంతరం తెలంగాణకు సంబంధించిన అంశాలు దేశంతోపాటు అంతర్జాతీయంగా వ్యాప్తి చెందుతున్నాయి. ఈ పాట రూపొందించడంపై తెలంగాణ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత (Kalvakuntla Kavitha) హర్షం వ్యక్తం చేశారు.