»Gang Rape Of A Young Woman In A Moving Car At Bengaluru Four People Arrested
Gang Rape: కదులుతున్న కారులో యువతిపై అత్యాచారం..నలుగురు అరెస్టు
కర్ణాటక బెంగళూరు(bengaluru)లో సిటీ పార్కులో కూర్చున్న 19 ఏళ్ల యువతిని కారులోకి లాక్కుని వెళ్లి.. నలుగురు వ్యక్తులు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. కదులుతున్న కారులోనే ఈ ఘటన మార్చి 25న జరుగగా..నలుగురు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్టు చేశారు.
కర్ణాటకలోని బెంగళూరు(bengaluru)లో నలుగురు యువకులు దారుణానికి తెగబడ్డారు. సిటీ పార్కులో తన స్నేహితుడితో కూర్చున్న 19 ఏళ్ల యువతి(19yrs young woman)ని నలుగురు దుండగులు కారులోకి లాక్కెళ్లారు. ఆ క్రమంలో కదులుతున్న కారులోనే వారు ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డారు. విషయం తెలిసిన పోలీసులు కేసు నమోదు చేసి.. నలుగురు నిందితులను అరెస్టు చేసి విచారణ జరుపుతున్నట్లు వెల్లడించారు. అయితే ఆ యువతి తన మిత్రుడితో కోరమంగళలోని నేషనల్ గేమ్స్ విలేజ్ పార్క్లో రాత్రి 10 గంటల సమయంలో కూర్చొని ఉండగా..ఆ వ్యక్తులు అతడిని బెదిరించి ఆమెను లాక్కెళ్లినట్లు విచారణలో తెలిసిందని పోలీసులు చెప్పారు.
ఈ ఘటన మార్చి 25న జరిగింది. కదులుతున్న కారులోనే నలుగురు వ్యక్తులు యువతిపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై ఆమెను రోడ్డు మధ్యలో పడేశారని పోలీసులు(police) వెల్లడించారు. ఆ తర్వాత తాను చాలా బాధపడ్డానని, ఆసుపత్రిలో చికిత్స పొందిన తర్వాత బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. ఆమె బెంగళూరులోని ఓ ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నట్లు తెలిసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విజయ్, శ్రీధర్, కిరణ్, సతీష్ లను అరెస్టు చేశారు. అయితే వారి వయసు 23 నుంచి 24 సంవత్సరాల మధ్య ఉందని పోలీసులు గుర్తించారు. ఈ నలుగురు వ్యక్తులు పలు సంస్థల్లో చిన్న చిన్న జాబ్స్ చేస్తున్నట్లు తెలిసింది.
ఇది తెలిసిన స్థానికులు బెంగళూరు(bengaluru) లాంటి నగరాల్లో ఇలాంటి ఘటనలు జరగడం సిగ్గుచేటని అంటున్నారు. మరికొంత మంది అయితే అసలు తప్పు ఎవరిదని ప్రశ్నిస్తున్నారు. ఆమె అర్థరాత్రి పార్కులో ఏం చేస్తుందని ప్రశ్నిస్తున్నారు. ఇంకొంత మంది అయితే యువకుల తీరు పట్ల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ ఘటనపై మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి.