»Modi Hathao Desh Bachao Posters 8 People Arrested
Arrested: ‘మోదీ హఠావో, దేశ్ బచావో’ పోస్టర్లు..8 మంది అరెస్టు
మోడీని టార్గెట్ చేస్తూ ఆప్(AAP) పోస్టర్ వార్ ఉధృతం చేసింది. మోడీ హటావో, దేశ్ బచావో ప్రచారాన్ని ఆప్ ప్రారంభించిన వారం తర్వాత ఢిల్లీ(delhi)లో పోలీసులు ఆరుగురిని అరెస్టు చేయగా..తాజాగా అహ్మదాబాద్(ahmadabad)లో ఇదే అంశంపై ఎనిమిది మందిని అరెస్టు చేశారు. అయితే పోస్టర్లతోపాటు పలువురు ప్రభుత్వ ఆస్తులను కూడా ధ్వంసం చేశారని పోలీసులు అంటున్నారు.
భారత ప్రధాని నరేంద్ర మోదీ(pm modi)కి వ్యతిరేకంగా అహ్మదాబాద్(ahmadabad)లో మోదీ హటావో, దేశ్ బచావో అనే పోస్టర్లు వెలిశాయి. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు శుక్రవారం ఎనిమిది మందిని అరెస్టు చేశారు. మరోవైపు గత వారం ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన పలువురు ఢిల్లీలో ఇలాంటి పోస్టర్లు అంటించినందుకు ఆరుగురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) కార్యాలయాలకు ఇలాంటి మెటీరియల్‌ను డెలివరీ చేస్తుండగా గత వారం ఢిల్లీ పోలీసులు 185 కేసులు నమోదు చేసి ఆరుగురిని పట్టుకున్నారు.
నిందితులు ప్రధాని నరేంద్ర మోదీపై అభ్యంతరకర పదాలు రాసి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేశారని పోలీసులు(police) చెబుతున్నారు. దేశ రాజధాని అంతటా గోడలు, విద్యుత్ స్తంభాలపై “మోదీ హటావో, దేశ్ బచావో” పోస్టర్లు ఉన్నాయని వెల్లడించారు. అటువంటి లక్ష పోస్టర్ల కోసం రెండు ప్రింటింగ్ ప్రెస్‌లకు ఆర్డర్ ఇచ్చారని విచారణలో తేలింది. అయితే అరెస్టయిన వారిలో ఇద్దరు ప్రింటింగ్ ప్రెస్ యజమానులు కూడా ఉన్నారు. ప్రధాని మోదీని(modi) లక్ష్యంగా చేసుకుని ఆప్ కార్యకర్తలు పోస్టర్లు వేసినట్లు తెలుస్తోంది.
ఢిల్లీ(delhi)లో పోస్టర్లపై కేసులు ప్రెస్ అండ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ బుక్స్ యాక్ట్ సెక్షన్ 12 కింద నమోదయ్యాయి. దేశంలో ముద్రించిన ప్రతి పుస్తకం లేదా కాగితం, ప్రింటింగ్ స్థలం, ఢిల్లీ ప్రివెన్షన్ ఆఫ్ డిఫేస్మెంట్ను స్పష్టంగా పేర్కొనాలని చెబుతుంది. మరోవైపు ఢిల్లీలో అరెస్టయిన ఆరుగురు కొన్ని గంటల తర్వాత బెయిల్‌పై విడుదలయ్యారు. ఈ నేపథ్యంలో AAP ఈ చర్యను ఖండించింది. అరెస్టులు చేయడం పట్ల “భారత ప్రజాస్వామ్య నిర్మాణంపై ప్రత్యక్ష దాడి” అని పేర్కొంది. 22 రాష్ట్రాల్లో 11 భాషల్లో ఇలాంటి పోస్టర్లు వేస్తున్నట్లు ఆప్ నేత, ఢిల్లీ మంత్రి గోపాల్ రాయ్ తెలిపారు. ఏప్రిల్ 10 నుంచి దేశంలోని విశ్వవిద్యాలయాలలో ఈ పోస్టర్లు అంటించనున్నట్లు వెల్లడించారు.
మీరు ప్రధానిపై ఎంత ఎక్కువ తప్పుడు ప్రచారం చేస్తే, ఆయనకు అంతగా ప్రజాదరణ పెరుగుతుందని ఢిల్లీ బీజేపీ(BJP) అధికార ప్రతినిధి హరీష్ ఖురానా అన్నారు. తమ ప్రధానిని నిరక్షరాస్యుడు అనడాన్ని ప్రజలు సహించరని పేర్కొన్నారు. ఈ క్రమంలో 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీలోని ఏడు సీట్లలో ఒక్కటి కూడా ఆప్ గెలవలేదని అభిప్రాయం వ్యక్తం చేశారు.