»Bollywood Actress Chrisann Pereira Said Uae Sharjah Jail Situations
Chrisann Pereira: జైల్లో నరకం అనుభవించా: ప్రముఖ నటి
డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొని అరెస్టైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) యూఏఈ షార్జా(Sharjah) జైలు(jail) నుంచి ఇటీవల విడుదలైంది. ఈ క్రమంలో ఆమె జైలులో చాలా కఠినమైన పరిస్థితులు ఎదుర్కొన్నట్లు వెల్లడించింది. అవి ఏంటీ? అసలు ఈమె జైలుకు ఎందుకు వెళ్లిందో ఇప్పుడు తెలుసుకుందాం.
ఇటీవల డ్రగ్స్ కేసులో అరెస్టై విడుదలైన బాలీవుడ్ నటి క్రిసాన్ పెరీరా(Chrisann Pereira) కీలక విషయాలను పంచుకున్నారు. క్రిసాన్ యూఏఈ(UAE) షార్జా(Sharjah)లోని జైలు నుంచి ఇటీవల విడుదలయ్యారు. డ్రగ్స్ స్మగ్లింగ్ కేసులో ఈ బాలీవుడ్ నటి అరెస్టయింది. పెరీరా తన వద్ద ఉన్న ట్రోఫీలో డ్రగ్స్‌ను దాచి ఉంచిన కారణంతో అధికారులు ఈ నెల ప్రారంభంలో షార్జాలో ఈమెను అరెస్టు చేశారు. అయితే ఆమెను ఈ కేసులో తప్పుగా ఇరికించారని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపించారు.
అయితే క్రిసాన్పై డ్రగ్స్ నాటినట్లు అభియోగాలు మోపిన ఆంథోనీ పాల్ (బేకర్), రాజేష్ బుభాటే అలియాస్ రవి (బ్యాంకర్)లను ముంబై పోలీసు క్రైమ్ బ్రాంచ్ ఇటీవల అరెస్టు చేయడంతో.. ఆమె తండ్రి (మార్క్)తో కూడిన ఆమె కుటుంబాని(family)కి ఉపశమనం లభించింది.
పెరీరాను ఏప్రిల్ 1న అరెస్టు చేశారు. అప్పటి నుంచి ఆమె జైలు(jail)లోనే ఉన్నారు. ఆంథోనీ పాల్ అనే వ్యక్తి తన సహచరుడు రాజేష్ భోభాటే ద్వారా ఆమెను ఆడిషన్‌కు వెళ్లమని కోరినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆడిషన్లో భాగంగా గంజాయితో నింపిన ట్రోఫీని తన వెంట తీసుకెళ్లమని పెరీరాను కోరారు. ఈ కేసులో ముంబై పోలీసులు ఇటీవల పాల్, భోభాటేలను అరెస్ట్ చేశారు. పెరీరాతో సహా ఐదుగురిని మాదక ద్రవ్యాలు తీసుకెళుతున్నట్లు చీత్రీకరించారని వారు పేర్కొన్నారు. ఆ ఇద్దరిని మే 2 వరకు పోలీసు కస్టడీకి పంపారు.
పాల్ సోదరి పెరీరా కుటుంబం ఉన్న అదే అపార్ట్మెంట్లో నివసిస్తుంది. ఒకసారి COVID-19 లాక్డౌన్ సమయంలో, పెరీరా తల్లి పెంపుడు కుక్క పాల్‌పై మొరిగింది. అతన్ని కాటు వేయడానికి ప్రయత్నించింది. దీంతో రెచ్చిపోయిన పాల్ కుక్కను కుర్చీతో కొట్టేందుకు ప్రయత్నించాడు. పెరీరా తల్లికి అది నచ్చక పాల్ ను పలువురి ముందు అవమానించింది. అప్పటి నుంచి బేకరీ యజమాని అయిన పాల్ ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడని ఆమె కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.
అయితే ఈ కేసులో 20 రోజులకుపైగా జైలులో ఉన్న ఈ నటి(Chrisann Pereira) చాలా దారుణమైన పరిస్థితులను ఎదుర్కొన్నట్లు చెప్పింది. టాయిలెట్ వాటర్ తో కాఫీ తాగానని, టైడ్ సర్ఫ్ తో స్నానం చేశానని చెప్పుకొచ్చింది. అంతేకాదు తనకు జైల్లో పెన్ను దొరకడానికి 20 రోజులు పట్టిందని వెల్లడించింది. ఇలా ప్రతి రోజు నరకం అనుభవించానని తెలిపింది. అలాంటి పరిస్థితులు శత్రువులకు కూడా రావొద్దని పేర్కొంది. 27 ఏళ్ల ఈ అమ్మడు సడక్ 2, బాట్లా హౌస్ వంటి సినిమాల్లో యాక్ట్ చేసింది.