Navdeep: మాదకద్రవ్యాల(drugs) వ్యవహారంలో సినీనటుడు నవదీప్ (Navdeep) ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) ఎదుట విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో మనీలాండరింగ్‌కు సంబంధించి ఈడీ అతడిని ప్రశ్నించినట్లు తెలుస్తుంది. డ్రగ్స్ విక్రేతలతో ఆర్థిక లావాదేవీలు, నవదీప్ బ్యాంకు ఖాతాల వివరాలు, అందులో జరిపిన లావాదేవీలపై ఈడీ(ED) పూర్తిగా విచారిస్తున్నట్లలు సమాచారం. కొన్నేళ్ల క్రితం టాలీవుడ్లో డ్రగ్స్ కేసు కలకం సృష్టించింది. ఆ కేసులో దర్శకుడు పూరీ జగన్నాథ్‌తో పాటు హీరో రవితేజ, నవదీప్ సహా పలువురిని పలువురిని పోలీసులతో పాటు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రశ్నించిన సంగతి తెలిసిందే . అప్పట్లో ఈ ఇష్యూపై పెద్ద దుమారమే రేగింది. ఆ కేసులో హీరో నవదీప్‌కు సంబంధం ఉందని పోలీసులు తేల్చారు. మదాపూర్ డ్రగ్స్ కేసులో నవదీప్‌కు సంబంధం ఉన్నట్లు తేలడంతో తాజాగా అతన్ని ఈడీ విచారిస్తోంది.
గుడిమల్కాపూర్ ఠాణా పరిధిలో ఇటీవల మాదకద్రవ్యాల కేసు నమోదైంది. అందులో బయటపడ్డ అంశాల ఆధారంగా ఈ నెల 10న విచారణకు హాజరు కావాలని నవదీప్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే. పోలీసులకు చిక్కిన నైజీరియన్ డ్రగ్పెడ్లర్తోపాటు తెలుగు సినీ నిర్మాత వెంకటరత్నారెడ్డి, రాంచందర్‌ను విచారించడంతో నవదీప్ పేరు వెలుగులోకి వచ్చింది. ఈ క్రమంలో నవదీప్‌ను కొద్దిరోజుల క్రితం టీన్యాబ్ పోలీసులు సుమారు ఆరు గంటలపాటు విచారించారు. టీన్యాబ్ కేసును ఆధారం చేసుకొని తాజాగా ఈడీ నవదీప్‌ను విచారణ చేస్తోంది.