Jagtial: బర్డ్ డే పార్టీ వేడుకలు జరుపుకోవాలని జగిత్యాల జిల్లాకు చెందిన అయిదుగురు యువకులు ఆదివారం ఎల్లంపల్లి ప్రాజెక్ట్‌కు వెళ్లారు. వీరితో పాటు మద్యం బాటిళ్లు కూడా తీసుకెళ్లారు. వీళ్లు సరదాగా పార్టీ చేసుకుంటూ మద్యం తీసుకున్నారు. యువకులందరూ అధికంగానే మద్యం సేవించారు. ఇలా అధికంగా మద్యం సేవించి స్నానం చేయడానికి నీటిలోకి దిగారు. ఈ ప్రాజెక్ట్‌లో అధికంగా నీరు ఉండటంతో ముగ్గురు యువకులు ఒడ్డుకు దగ్గరగానే స్నానం చేశారు. కానీ మిగతా ఇద్దరు యువకులు సరదాగా చాలా దూరంగా వెళ్లారు. అప్పటికీ స్నేహితులు వీళ్లను దగ్గరకు రమ్మని చెబుతున్నా ఇంకా లోపలికి వెళ్లారు. చివరికి అందులో ధర్మతేజ అనే యువకుడు నీటిలో మునిగిపోయాడు. స్నేహితులు ఎంతసేపు వెతికనా.. తన ఆచూకీ లభ్యం కాలేదు. దీంతో మిగతా వ్యక్తులు ఒడ్డుకు చేరి పోలీసులకు తెలిపారు. గల్లంతైన యువకుడి కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. అధికంగా మద్యం సేవించి స్నానాలకి వెళ్లడం వల్లే ఈ ఘటన జరిగిందని పోలీసులు తెలిపారు