»Police Seized Drugs In An Apartment In Sr Nagar Hyderabad
Hyderabad: హైదరాబాద్ లో భారీగా డ్రగ్స్ పట్టివేత
మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి.. అది తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు.
Hyderabad: మత్తు పదార్థాలు జీవితాలను నాశనం చేస్తాయి.. అది తెలిసి కూడా యువత మత్తుకు బానిసలుగా మారుతున్నారు. పోలీసులు ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహిస్తూ భారీ మత్తు పదార్థాలను పట్టుకుంటున్న జనాల్లో మార్పు రావడం లేదు. తాజాగా హైదరాబాదులో భారీ స్థాయి లో మత్తు పదార్థాలను పట్టుకున్నారు పోలీసులు. ఎస్సార్ నగర్ లోని సర్వీస్ అపార్ట్మెంట్లో డ్రగ్స్ ని నార్కోటిక్ బ్యూరో స్వాధీన పరుచుకుంది. పుట్టిన రోజు పార్టీ కోసం గోవా నుంచి ఎక్స్టెన్సీ పిల్స్ ను యువకులు తీసుకొచ్చారు. పట్టుబడిన వారంతా కూడా నెల్లూరు జిల్లాకు చెందిన వారేనని నార్కోటిక్ బ్యూరో అధికారులు తెలిపారు.
వారిలో 12 మంది ఇంజనీరింగ్ విద్యార్థి లతో పాటు సాఫ్టువేర్ ఉద్యోగులను అధికారులు అరెస్ట్ చేశారు. ప్రేమ్ చంద్ అనే యువకుడి బర్త్ డే పార్టీ కోసం గోవా నుంచి సంపత్ గోవా నుంచి డ్రగ్స్ తెప్పించినట్లు సమాచారం. ప్రేమ్ చంద్ 30 మంది కోసం డ్రగ్ పార్టీని ఏర్పాటు చేశాడు. వారంతా ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్న ఇంజనీర్లు కలిపి పార్టీ నిర్వహించుకునేందుకు ఏర్పాటు చేశారు.