విరూపాక్ష సినిమా(Virupaksha Movie)తో యువ దర్శకుడు కార్తీక్ దండు(Karthik Dandu) ఇండస్ట్రీలో టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలిచాడు. కార్తీక్ దండు ప్రతిభకు అందరి నుంచి ప్రశంసలు దక్కుతున్నాయి. మిస్టరీ సస్పెన్స్ మిక్స్ చేసి తీసిన సినిమా ఆడియన్స్ కు బాగా కనెక్ట్ అయ్యింది. సస్పెన్స్ ని అద్భుతమైన ట్విస్టులతో రివీల్ చేసిన విధానం అందర్నీ ఆకట్టుకుంది. ఈ సినిమా ఆరు రోజుల్లోనే దాదాపు రూ.60 కోట్ల గ్రాస్ ను వసూలు చేసింది. హీరో సాయి ధరమ్ తేజ్(Hero Sai dharam Tej) కెరీర్లోనే బిగ్గెస్ట్ హిట్ (Biggest Hit)గా విరూపాక్ష నిలిచింది.
హీరోయిన్ సంయుక్త మీనన్(Heroine Samyukta Menon) నటనకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా సంయుక్త మీనన్ తన డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu)కు ప్రత్యేక బహుమతిని ఇచ్చింది. ప్రస్తుతం ఈ సంఘటన నెట్టింట వైరల్(Viral) అవుతోంది. ఏ సినిమా అయినా హిట్ అయితే నిర్మాతలు దర్శకుడికో లేకుంటే నటీనటులకో గిఫ్ట్ ఇవ్వడం మామూలే. అయితే ఇక్కడ సంయుక్త మీనన్ డైరెక్టర్ కార్తీక్ కు ఖరీదైన బహుమతిని(Costly Gifts) ఇచ్చిందట.
విరూపాక్ష సినిమా(Virupaksha Movie) రిలీజ్ సందర్భంగా డైరెక్టర్ కార్తీక్ దండు(Karthik Dandu) సినిమా థియేటర్స్ కు వెళ్లారు. ఆ సమయంలో అతని ఫోన్ ఎవరో దొంగిలించారు. తన ఫోన్ లేకపోవడం కార్తీక్ చాలా బాధపడ్డారు. కానీ థియేటర్ రెస్పాన్స్ చూసి ఆ బాధను మర్చిపోయారు. ఆ సంఘటన గురించి హీరోయిన్ సంయుక్త మీనన్(Heroine Samyukta Menon) తెలుసుకుంది. కార్తీక్ కోసం ఐఫోన్ ని బహుమతిగా ఇచ్చినట్లు సంయుక్త మీనన్ ఇటీవలె ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.