»Hyd Metro Train Offers Cut In Rush Time Other Ticket Prices Increase April 1st 2023
HYD Metro: మెట్రో ఆఫర్లలో కోత..ఛార్జీల బాదుడు!
మీరు హైదరాబాద్ మెట్రో(hyderabad metro)లో తరచూ ప్రయాణిస్తారా? అయితే ఈ న్యూస్ మీరు చదవాల్సిందే. ఎందుకంటే రేపటి(ఏప్రిల్ 1) నుంచి L&T మెట్రో పలు ఆఫర్లతోపాటు రేట్లను కూడా పెంచుతున్నట్లు ప్రకటించింది. దీంతోపాటు రద్దీ సమయాల్లో ఆఫర్లు అమల్లో ఉండవని స్పష్టం చేసింది.
హైదరాబాద్ మెట్రో(hyderabad metro) ప్రయాణికులకు గమనిక. ఎందుకంటే రేపటి( ఏప్రిల్ 1) నుంచి మెట్రో ఛార్జీలు పెరగనున్నాయి. రేట్లను భారీగా పెంచినట్లు తెలుస్తోంది. దీంతోపాటు L&T సంస్థ ఆఫ్-పీక్ అవర్స్ ఆఫర్‌ను ప్రవేశపెట్టింది. ఈ క్రమంలో కాంటాక్ట్‌లెస్ స్మార్ట్ కార్డులపై (CSC) నోటిఫైడ్ ఛార్జీలపై 10 శాతం తగ్గింపును అందిస్తున్నట్లు వెల్లడించింది. అయితే ఈ ఆఫర్ కేవలం ప్రయాణికుల రద్దీ లేని సమయాల్లో అంటే ఉదయం 6 నుంచి 8 గంటల వరకు, తర్వాత రాత్రి 8 నుంచి 11 గంటల వరకు మాత్రమే అమల్లో ఉంటుందని తెలిపింది.
అదనంగా సూపర్ సేవర్ ఆఫర్-59ను 1.3 మిలియన్లకు పైగా ప్రయాణికులు ఉపయోగించుకుంటున్నారు. ఇది మార్చి 31న ముగియనుంది. ఈ నేపథ్యంలో L&T MRHL కొత్త సూపర్ సేవర్ ఆఫర్-99ని ఏప్రిల్ 1వ తేదీ నుంచి మార్చి 31, 2024 వరకు ప్రవేశపెట్టినట్లు వెల్లడించింది.
ప్రయాణీకులు 100 నోటిఫైడ్ హాలిడేస్‌లో రూ.99తో అపరిమితంగా ప్రయాణించవచ్చని స్పష్టం చేసింది. SSO-99 ఆఫర్ అంతకు ముందు రూ.59 స్మార్ట్ కార్డ్‌ల మాదిరిగా ఉండేది. ఇప్పుడు వాటిని రూ.99కి పెంచేశారు. SSO-99 ఆఫర్ వర్తించే నోటిఫైడ్ సెలవుల జాబితా ఆన్లైన్, స్టేషన్లలో అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు.
ప్రస్తుతం హైదరాబాద్ మెట్రో టైన్స్ మూడు కారిడార్లలోని 69 కిలోమీటర్లు, 57 స్టేషన్ల మీదుగా ప్రతిరోజూ ప్రయాణిస్తున్నాయి. ఈ క్రమంలో సుమారు 4.4 లక్షల మంది ప్రయాణికులను అనేక ప్రాంతాలకు రవాణా చేస్తోంది. ఈ మార్పులు ప్రయాణీకులకు మరింత ఎక్కువ వినియోగాన్ని అందించగలవని L&TMRHL, MD & CEO, KVB రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.