Hyderabad Metro: హైదరాబాద్లో ట్రాఫిక్ నుంచి తప్పించుకోవడానికి చాలామంది మెట్రోని వినియోగిస్తుంటారు. అయితే అధికారులు మెట్రో ప్రయాణికులకు షాక్ ఇచ్చారు. ఇంతకు ముందు మెట్రో కార్డుపై 10 శాతం రాయితీ ఉండేది. హాలిడే కార్డు రూ.59 కూడా ఉండేది. అయితే దీనిని గతంలో రద్దు చేసి మళ్లీ అమల్లోకి తీసుకొచ్చారు. కానీ మళ్లీ తాజాగా దీనిని రద్దు చేశారు. మెట్రో కార్డుపై ఉండే రాయితీతో పాటు.. హాలిడే కార్డును ఎత్తివేశారు. సాధారణ రోజుల్లో మెట్రో కార్డును ప్రయాణికులు కొనుగోలు చేస్తే ఉదయం 6 నుంచి 8గంటల వరకు, రాత్రి 8 నుంచి అర్ధరాత్రి వరకు ప్రయాణ ఛార్జీలో 10 శాతం రాయితీ ఉండేది. అయితే మెట్రో రైలు ప్రయాణానికి భారీగా డిమాండ్ పెరగడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.