BDK: కొత్తగూడెం కార్పొరేషన్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు చెల్లించాలని మాజీ మున్సిపల్ ఛైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మీ కమిషనర్ సుజాతను కోరారు. ఇవాళ కమిషనర్‌ను కలిసి వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా ఆమే మాట్లాడుతూ.. ప్రతినెల 4వ తేదీ లోపు పారిశుద్ధ్య కార్మికులకు గౌరవ వేతనం చెల్లించాల్సి ఉందన్నారు. గత ప్రభుత్వంలో సకాలంలో అందేదని గుర్తు చేశారు.