»The Congestion In Metro Trains Is Increasing Significantly Hyderabad
Hyderabad Metro: సరికొత్త రికార్డు సృష్టించిన హైదరాబాద్ మెట్రో
తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది.
Hyderabad Metro: తెలంగాణ రాజధాని హైదరాబాద్ నగరంలో మెట్రోలో ప్రయాణించే ప్రయాణికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. ఒకే రోజులో ప్రయాణించే మెట్రో ప్రయాణికుల సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుంది. మూడు కారిడార్లలోనే ఏకంగా 5.47 లక్షల మంది మెట్రో ట్రైన్లో ప్రయాణించారు. నగరంలో మెట్రో పరుగులు పెట్టడం ప్రారంభించి ఇప్పటికే ఆరేళ్లు కావస్తోంది. కరోనా తర్వాత మెట్రో రైళ్లలో రద్దీ క్రమంగా పెరుగుతుండటంతో మెట్రో అధికారులు కొన్ని రూట్లలో ఎక్కువ రైళ్లను నడుపుతున్నారు. అయితే పండగల సమయాల్లో ప్రయాణికుల ప్రయాణం ఎక్కువగా ఉంటుంది.
సాఫ్ట్వేర్ ఉద్యోగులతో సోమవారం నుంచి శుక్రవారం వరకు మెట్రో రద్దీగా ఉంటుంది. చాలా మంది ఐటీ ఉద్యోగులు ఆఫీసుకు ఆలస్యంగా రాకుండా మెట్రోను ఎంచుకుంటారు. హైదరాబాద్ నగరం రోజురోజుకు అభివృద్ధి చెందుతుండడంతో అనేక అంతర్జాతీయ కంపెనీలు నగరంలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూపుతున్నాయి. 2017లో హైదరాబాద్ నగరంలో మెట్రో పరుగులు ప్రారంభించగా.. ముందుగా మియాపూర్ స్టేషన్లో ప్రారంభోత్సవం జరిగింది. నగరంలో మెట్రో ప్రాజెక్టును దశలవారీగా అమలు చేస్తామన్నారు. ప్రస్తుతం మూడు లైన్లు పనిచేస్తున్నాయి. నగరం అంతటా ముఖ్యమైన ప్రదేశాలను కవర్ చేసే మొత్తం 27 స్టేషన్లు ఉన్నాయి.