»Mahadev App Among 22 Illegal Online Betting Platforms Blocked
Mahadev : మహదేవ్‌తో సహా 22 యాప్‌లు, వెబ్సైట్లను బ్లాక్ చేసిన ప్రభుత్వం
మహాదేవ్ బుక్, రెడ్డిఅన్నాప్రిస్టోప్రో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్లాక్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ, రైడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది.
Mahadev : మహాదేవ్ బుక్, రెడ్డిఅన్నాప్రిస్టోప్రో సహా 22 అక్రమ బెట్టింగ్ యాప్‌లు, వెబ్సైట్లపై కేంద్ర ప్రభుత్వం ఆదివారం బ్లాక్ ఉత్తర్వులు జారీ చేసింది. అక్రమ బెట్టింగ్ యాప్ సిండికేట్‌పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఇడి) విచారణ, రైడ్ తర్వాత ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఈ చర్య తీసుకుంది. తన దర్యాప్తులో ఈ యాప్‌ల ఆపరేషన్ చట్టవిరుద్ధమని ఈడీ ప్రకటించింది. మహదేవ్ బుక్ యాప్ యజమాని ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్నారు. మనీలాండరింగ్ నిరోధక చట్టం (pmla)లోని సెక్షన్ 19 కింద అతడిని అరెస్టు చేశారు. ఈ ప్లాట్‌ఫారమ్‌లను బ్లాక్ చేసే అధికారం ఉన్నప్పటికీ ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఎలాంటి అభ్యర్థనను పంపలేదని ఎలక్ట్రానిక్స్ అండ్ ఐటీ శాఖ సహాయ మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ ఆరోపించారు.
సెక్షన్ 69A ఐటీ చట్టం ప్రకారం వెబ్సైట్-యాప్‌ను మూసివేయమని సిఫార్సు చేసే పూర్తి అధికారం చత్తీస్‌గఢ్ ప్రభుత్వానికి ఉందని ఆయన చెప్పారు. అయితే, ప్రభుత్వం గత 1.5 సంవత్సరాలుగా దర్యాప్తు చేస్తున్నప్పటికీ, వారు అలా చేయలేదు. కనీసం రాష్ట్ర ప్రభుత్వం నుండి అలాంటి అభ్యర్థన కూడా ఏమీ రాలేదు. ఛత్తీస్‌గఢ్ ఎన్నికల కోసం దుబాయ్ నుంచి రూ. 5.39 కోట్లు పంపినట్లు మహదేవ్ బెట్టింగ్ యాప్‌కు సంబంధించిన దర్యాప్తును ఉటంకిస్తూ శుక్రవారం ఈడీ వెల్లడించింది. మహదేవ్ బెట్టింగ్ యాప్ ప్రమోటర్ దుబాయ్ నుంచి ముఖ్యమంత్రి భూపేష్ బఘేల్‌కు కోట్లాది రూపాయలు పంపినట్లు దాడిలో అరెస్టయిన నిందితుడు అసీమ్ దాస్ వెల్లడించినట్లు ఇడి తెలిపింది. దీంతో పాటు ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖర్చులకు కూడా డబ్బులు పంపారు.
సీఎం బఘేల్‌కు రూ. 508 కోట్లు
ఈడీ విచారణను ఉటంకిస్తూ, మహాదేవ్ యాప్ ప్రమోటర్లు ఇప్పటివరకు సీఎం భూపేష్ బఘేల్‌కు దాదాపు రూ.508 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఈ కేసులో ఛత్తీస్‌గఢ్ పోలీస్ కానిస్టేబుల్ భీమ్ యాదవ్‌ను కూడా ఇడి అరెస్టు చేసింది. భీమ్ యాదవ్ గత మూడేళ్లలో చాలాసార్లు దుబాయ్ వెళ్లాడు. భీమ్ యాదవ్ లంచం డబ్బు రాజకీయ నాయకులు, పోలీసు అధికారులకు చేరవేసే వ్యక్తి.