PM Modi: బిహార్లో పర్యటన చేస్తున్న ప్రధాని మోదీ ఈడీ దాడులపై విపక్షాలు చేస్తున్న ఆరోపణలకు గట్టి కౌంటర్ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈడీ కేవలం ఓ స్కూల్ బ్యాగులో దాచిన రూ.35 లక్షలను మాత్రమే స్వాధీనం చేసుకోగలిగింది. అదే బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దర్యాప్తు సంస్థ ఇప్పటివరకు దాదాపు రూ.2200 కోట్ల అవినీతి సొమ్మును బయటపెట్టింది. ఆ నోట్ల గుట్టలను తరలించడానికి కనీసం 70 చిన్న ట్రక్కులు కావాలని మోదీ అన్నారు.
రాజకీయ నాయకులపై జరిపిన సోదాల్లో బయటపడిన డబ్బంతా దేశంలోని పేద ప్రజలదే అని మోదీ తెలిపారు. బీజేపీలో మోదీ తర్వాత ప్రధాని అభ్యర్థి ఎవరని విమర్శలపై ఆయన స్పందించారు. పార్టీలో తనకు వారసులు లేరని తెలిపారు. సామాన్య ప్రజలే వారసులన్నారు. ముస్లింలకు రిజర్వేషన్లు కల్పిస్తామని, వారసత్వ పన్ను తీసుకురావాలని కాంగ్రెస్ అంటున్నాయని మోదీ అన్నారు. నేను ఉన్నంత వరకు అలా జరగనివ్వను. ప్రజల సొమ్మును దోచుకోవాలంటే వారి ప్రయత్నాలకు అడ్డుగోడలా నిలబడతానని మోదీ అన్నారు.