కేంద్రప్రభుత్వమే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. అయితే ఈ ఆరోపణలపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. అవినీతి కేసులో వచ్చిన సొమ్మును పేదలకు పంచిపెడుతామన్నారు.
PM Modi: Money found by ED in corruption cases will be given to the poor
PM Modi: ఈమధ్యకాలంలో ఎక్కువగా అవినీతి సొమ్ము బాగా బయటపడింది. అయితే కేంద్రప్రభుత్వమే దర్యాప్తు సంస్థలను దుర్వినియోగం చేస్తోందని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. ఈ ఆరోపణలపై ప్రధానమంత్రి మోదీ స్పందించారు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కాంగ్రెస్ ప్రభుత్వంలో నిరపయోగంగా ఉందన్నారు. బీజేపీ ప్రభుత్వంలోనే ఈడీ కరెక్ట్‌గా పనిచేయడం ప్రారంభించిందని అన్నారు. బీజేపీ ప్రభుత్వ సమయంలో ఈడీ స్వాధీనం చేసుకున్న సొమ్ము పేదలకు చెందేలా చేస్తామన్నారు.
అవినీతి కేసుల్లో ఈడీ దోచుకున్న సొమ్ము మొత్తం పేదలకు పంచేందుకు కేంద్రం ప్రయత్నిస్తోందన్నారు. గత ప్రభుత్వంలో కొందరు అధికార బలంతో పదవులను దుర్వినియోగం చేసి పేదల సొమ్మును దోచుకున్నారని మోదీ ఆరోపించారు. అలా అవినీతిగా వచ్చిన డబ్బు అంతా పేదలకు చెందాలని కోరుకుంటున్నానని మోదీ తెలిపారు. దీనికోసం లీగల్ టీమ్ సహాయం కూడా తీసుకున్నట్లు తెలిపారు. అలాగే ఈడీ స్వాధీనం చేసుకున్న డబ్బును ఏం చేయాలో సలహా ఇవ్వాలని మోదీ న్యాయవ్యవస్థను కోరారు. దీనికోసం ఏవైనా చట్టపరమైన మార్పులు చేయాల్సి వస్తే చేస్తామని తెలిపారు. అయితే బీజేపీ ప్రభుత్వంలో రూ.2200 కోట్లు జప్తు చేశారు.