AP: సీఐడీ మాజీ చీఫ్ సునీల్ కుమార్కు పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. రఘురామకృష్ణంరాజు కస్టోడియల్ టార్చర్ కేసులో ఆయన A1 నిందితుడిగా ఉన్నారు. ఈ కేసు విచారణలో భాగంగా గత నెలలో సునీల్ కుమార్కు నోటీసులు ఇచ్చారు. అయితే, తన కుటుంబ సభ్యుల అనారోగ్యం కారణంగా హాజరుకాలేనని రెండు వారాల గడువు కోరారు. దీంతో గుంటూరు సీసీఎస్ ఆఫీసులో ఈనెల 15న విచారణకు రావాలని ఆదేశించారు.