KNR: భారత రాజ్యాంగ పక్షోత్సవాల సందర్భంగా సామాజిక సమరసత వేదిక కరీంనగర్ ఆధ్వర్యంలో ‘మనము–మన భారత రాజ్యాంగం ప్రత్యేకతలు’ సహా మూడు పుస్తకాలు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్ మాట్లాడుతూ.. ప్రపంచంలోకెల్లా భారత రాజ్యాంగం గొప్పదని, ఇది ప్రజలందరికీ సామాజిక, ఆర్థిక సమానత్వం కల్పిస్తుందని పేర్కొన్నారు.