NZB: నిజామాబాద్ నగరంలో అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్త ఆధ్వర్యంలో నిర్వహించిన అయ్యప్ప పడిపూజ కార్యక్రమానికి పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, పలువురు కాంగ్రెస్ నాయకులతో కలిసి హాజరయ్యారు. అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజ చేశారు. అనంతరం అర్చకులు అయ్యప్ప స్వామి తీర్థ ప్రసాదాలు అందజేశారు.