PDPL: ప్రతి నెలలో పౌర్ణమి తరువాత వచ్చే చవితి తిథిని సంకష్టహర చతుర్థిగా పరిగణిస్తారు. సోమవారం రోజున సంకష్టహర చతుర్థి దీక్ష చేపట్టిన భక్తులు రాత్రి 8.17 నిమిషములకు చంద్రోదయం అనంతరం దీక్ష పూర్తి అవుతుంది. మానవులు తమ జీవితంలో వచ్చే సంకటాలను తొలగించుకోవడానికి ఈ దీక్ష చేపడతారు. ఏ శుభకార్యం చేయాలన్నా మొదట విగ్నేశ్వరున్ని పూజించడం మన సాంప్రదాయం.