టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు(dil raju) రాజకీయాల్లోకి రాబోతున్నారని మళ్లీ చర్చలు ఊపందుకున్నాయి. ఇటీవల నిజమాబాద్ జిల్లా(nizamabad district)లో దిల్ రాజు స్వయంగా నిర్మించి నిర్వహిస్తున్న గుడికి రేవంత్ రెడ్డిని(revanth reddy) ఆహ్వానించడంతో ఈ వార్తలు మళ్లీ మొదలయ్యాయి. అయితే వీటిపై దిల్ రాజు నుంచి ఎలాంటి ప్రకటన రాలేదు.
టాలీవుడ్ స్టార్ హీరో పవన్ కళ్యాణ్(Pawan Kalyan), సాయి ధరమ్ తేజ్(sai dharam tej) నటిస్తున్న తమిళ చిత్రం ‘వినోదయ సీతం’కి అధికారిక రీమేక్ నుంచి అప్ డేట్ వచ్చింది. ఈ సినిమాను జూలై 28, 2023న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ చిత్రానికి సముద్రకని(samuthirakani) డైరెక్షన్ చేస్తున్నారు.
ఆస్ట్రేలియా వర్సెస్ ఇండియా వన్డే సిరీస్ ఓటమి షాక్ తర్వాత టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ(rohit sharma)కు ప్రముఖ క్రికెటర్ సునీల్ గవాస్కర్(sunil gavaskar) హెచ్చరించారు. మ్యాచ్ ఉన్న వేళ రోహిత్ తన బావమరిది పెళ్లికి వెళ్లడంపై గవాస్కర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి క్రమంలో కెప్టెన్ ప్రతి మ్యాచులో కూడా ఆడాలని అభిప్రాయం వ్యక్తం చేశారు.
ఏపీలో ఎమ్మెల్యే కోటాలో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌కు పాల్పడ్డారనే ఆరోపణలపై నలుగురు వైఎస్‌ఆర్ కాంగ్రెస్(YSRCP) ఎమ్మెల్యేలను(mlas) శుక్రవారం పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి(Sajjala Ramakrishna Reddy) నలుగురు ఎమ్మెల్యేలు ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణరెడ్డిలను సస్పెండ్ చేస...
తెలంగాణలో రేపు(మార్చి 25న) నిర్వహించనున్న బీజేపీ(BJP) మహా ధర్నాకు హైకోర్టు(telangana High Court) అనుమతి ఇచ్చింది. అయితే ఈ నిరసనలో కేవలం 500 మంది మాత్రమే పాల్గొనాలని వెల్లడించింది.
ప్రముఖ నటి దీపికా పదుకొణె(deepika padukone), రణవీర్ సింగ్(ranveer Singh) కపుల్ మధ్య విబేధాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఇటీవల వెలుగులోకి వచ్చిన వీడియో(video)లో రణ్ బీర్ దీపికాకు చేయి ఇచ్చినా కూడా ఆమె పట్టించుకోకుండా వెళ్లింది. ఇది చూసిన అభిమానులు అప్పడే డివోస్ తీసుకుంటున్నారా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో కొంత చర్చకు దారితీసింది.
Vallabhaneni Vamshi : ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు రాజకీయంగా దుమారం రేపాయి. కచ్చితంగా వైసీపీనే గెలుస్తుందనుకున్న చోట.. క్రాస్ ఓటింగ్ జరిగి టీడీపీ గెలవడం అందరినీ విస్మయానికి గురిచేసింది. ఈ గెలుపును టీడీపీ నేతలు ఎంజాయ్ చేస్తుంటే... అధికార వైసీపీ నేతలు రగిలిపోతున్నారు.
MLC Elections : ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పంచుమర్తి అనురాధ విజయం సాధించిన సంగతి తెలిసిందే. అయితే.. క్రాస్ ఓటింగ్ కారణంగానే ఆమె గెలిచిందని, నలుగురు వైస్సార్సీపీ ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారని అధికార పార్టీ ఆరోపిస్తోంది.
ఏపీ రాష్ట్రానికి(AP Government) కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చిన రూ.6,356 కోట్ల గ్రాంట్ ఉపయోగించుకోకుండా అలాగే ఉందని కాగ్(CAG) తెలిపింది. గత ఏడాదితో పోల్చితే రుణాలు కూడా పెంచామని.. కానీ ఖర్చు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని నివేదిక గుర్తు చేసింది
విద్యుత్ ఉద్యోగులు తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఖైరతాబాద్(kairatabad)లోని విద్యుత్ సౌధ దగ్గర ఆందోళన నిర్వహించారు. ఈ నేపథ్యంలో పంజాగుట్ట-ఖైరతాబాద్ రహదారిపై పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం ఏర్పడింది.
రోజా సీరియల్ నటి ప్రియాంక నల్కారి(Priyanka Nalkari) రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మలేషియాలోని మురుగన్ ఆలయంలో తన ప్రియుడిని మనువాడారు. ఈ సందర్భంగా వివాహం చేసుకున్న ఫొటోలను తన ఇన్ స్టా గ్రాంలో పోస్ట్ చేసి వెల్లడించింది.
సినీ నటుడు మంచు మనోజ్ రెండో పెళ్లి (Manchu Manoj second marriage) చేసుకోవడం ఆయన ఫ్యామిలీలో కొందరికి ఇష్టం లేదని కొద్ది రోజులుగా వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. ఈ అంశంపై తండ్రి, నటుడు మోహన్ బాబు (Mohan Babu) స్పందించారు.
ప్రపంచ కుబేరుడు.. టెస్లా, ట్విట్టర్ సీఈఓ ఎలాన్ మస్క్(Elon Mask) ట్విట్టర్‌లో 'గాడ్'(god)ని బ్లాక్ చేసిన స్క్రీన్ షాట్ చిత్రాన్ని పోస్ట్ చేశారు. ఇది చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. దేవుడికి ట్విట్టర్ ఖాతా(twitter account) ఉందా అంటూ పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది.
మంచు కుటుంబంలో విబేధాలు బయటపడినట్లుగా జోరుగా వార్తలు వస్తున్నాయి. కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు తనయులు మంచు విష్ణు, మంచు మనోజ్ మధ్య విబేధాలు వెలుగు చూశాయట. తన ఇంట్లోకి జొరబడి తన వాళ్లను, బంధువులను కొడుతున్నారంటూ మనోజ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం నెట్టింట వైరల్ గా మారింది.