»23 Plates Of Idlis Per Day Hyderabad Who Spent Rupees 6 Lakhs
Idlis: రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలు.. రూ.6 లక్షలు ఖర్చు చేసిన హైదరాబాదీ
హైదరాబాద్(Hyderabad)కు చెందిన ఒక ఇడ్లీ(idlis) ప్రేమికుడు ఏడాది కాలంలో ఇడ్లీల కోసం కోసం రూ. 6 లక్షలు ఖర్చు చేశాడు. ఈ మేరకు ప్రముఖ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ స్విగ్గీ(swiggy) గురువారం అతని వివరాలను వెల్లడించింది. అతను సగటును రోజుకు 23 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు, స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం చేసిన ఆర్డర్లతో సహా మొత్తం 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ తెలిపింది.
మీరు ఎప్పుడైనా ఒకే రోజు 23 ప్లేట్ల ఇడ్లీని(idlis) ఆర్డర్ చేశారా? అంటే దాదాపు అనేక మంది కాదని చెబుతారు. కానీ హైదరాబాద్(hyderabad)కు చెందిన ఓ వ్యక్తి మాత్రం రోజుకు సగటను 23 ప్లేట్ల ఇడ్లీ టిఫిన్లు ఆర్డర్ చేసినట్లు స్విగ్గీ(swiggy) వెల్లడించింది. ఈరోజు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఈ మేరకు ఆ వివరాలను పంచుకుంది. ఆ వివరాలు ఏంటో ఇప్పుడు చుద్దాం.
హైదరాబాద్(hyderabad) కు చెందిన ఓ వ్యక్తి ఏకంగా ఒకే రోజు సగటున 23 ప్లేట్ల ఇడ్లీ టిఫిన్లు ఆర్డర్ చేశాడు. ఆ క్రమంలో ఏడాది వ్యవధిలో కేవలం ఇడ్లీల కోసమే 6 లక్షల రూపాయలు ఖర్చు చేశాడు. ఈరోజు (మార్చి 30న) ప్రపంచ ఇడ్లీ దినోత్సవం సందర్భంగా ఈ మేరకు స్విగ్గీ అతని గురించి తెలిపింది.
ఈ ఇడ్లీ ప్రేమికుడు బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో ప్రయాణిస్తున్నప్పుడు స్నేహితులు, అతని కుటుంబ సభ్యుల కోసం 8,000 లకుపైగా ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేసినట్లు ప్రకటించింది. ఈ నేపథ్యంలో గత 12 నెలల్లో వారు ప్రతిరోజూ సగటున 23 ప్లేట్ల ఇడ్లీలను తిన్నారని స్విగ్గీ తెలిపింది. ఆ వ్యక్తి 8,428 ప్లేట్ల ఇడ్లీలను ఆర్డర్ చేశాడని.. అతన్ని నగరంలో ఇడ్లీ ప్రేమికుడిగా పిలుస్తారని పలువురు అంటున్నారు. అతను మార్చి 30, 2022 నుంచి మార్చి 25, 2023 మధ్య కాలంలో ఈ ఆర్డర్లు చేసినట్లు స్విగ్గీ పేర్కొంది.
ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఇడ్లీలు చాలా ప్రజాదరణ పొందాయని చెబుతున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా స్విగ్గీ(swiggy) విశ్లేషణ ప్రకారం బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ ప్రాంతాల్లో ఇడ్లీల ఆర్డర్లు ఎక్కువగా వచ్చిన నగరాల్లో ఇవి టాప్ 3లో ఉన్నాయని తెలిపింది. దీంతోపాటు ముంబై, కోయంబత్తూర్, పూణే, వైజాగ్, ఢిల్లీ, కోల్కతా, కొచ్చి నగరాలు కూడా ఇడ్లీలకు ఆదరణ పొందుతున్నాయని వెల్లడించారు.
అయితే వినియోగదారులు తమ ఇడ్లీలతో పాటు సాంబార్, కొబ్బరి చట్నీ, కారంపూరి, మేడు వడ, సాగు, నెయ్యి, రెడ్ చట్నీ, జైన్ సాంబార్, టీ, కాఫీ వంటి ఇతర వంటకాలను ఆర్డర్ చేస్తున్నట్లు వెల్లడించింది.