»March 30th World Idli Day And Its Health Benefits To
World Idli Day: నేడు ప్రపంచ ఇడ్లీ దినోత్సవం…దీంతో ఆరోగ్య ప్రయోజనాలు కూడా
మీకు ఇడ్లీ అంటే ఇష్టమా? మీ ఆహారంలో ఎక్కువగా ఇడ్లీ వంటకాన్ని తింటున్నారా? ఇడ్లీ భోజనంలో భాగంగా తీసుకోవడం ద్వారా కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
ఎక్కువ మంది ఆహార ప్రియులు ఇష్టపడే టిఫిన్లలో ఇడ్లీ కూడా ఒకటి. అయితే ఈరోజు(మార్చి 30) ప్రపంచ ఇడ్లీ దినోత్సవం(World Idli Day) సందర్భంగా ఇడ్లీ తినడం వల్ల కలిగే ఉపయోగాలు సహా పలు అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఇడ్లీ అనేది భారత ఖండంలోని ఒక రకమైన రుచికరమైన రైస్ కేక్ అని చెప్పవచ్చు. ఇది దక్షిణ భారతదేశం, శ్రీలంక సహా పలు ప్రాంతాల్లో అల్పాహార ఆహారంగా ప్రసిద్ధి చెందింది. బియ్యం, పులియబెట్టిన మినప పప్పుతో కూడిన పిండిని ఆవిరి చేయడం ద్వారా ఇడ్లీలను తయారు చేస్తారు. దీంతోపాటు అనేక రకాల తృణధాన్యాలు, పప్పుల కలయికతో కూడా ఇటీవల కాసంలో ఇడ్లీలను తయారు చేస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం ఉత్సాహంతో కూడిన ఇడ్లీ ప్రేమికులు ఈ దక్షిణ భారత ప్రధాన ఆహారమైన ఇడ్లీ కోసం కూడా ఓ రోజును కేటాయించాలని నిర్ణయించుకోవడంతో ఈ వేడుక మొదలైంది. అయితే ఇడ్లీ వంటకాన్ని తినడం ద్వారా కొన్ని పోషక లక్షణాలతోపాటు అనేక ఆరోగ్య ప్రయోజనాలు కూడా ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చుద్దాం.
ఇడ్లీలు తక్కువ కేలరీలు ఉంటాయి కాబట్టి వీటిని ఆహారంలో స్వీకరించడం ద్వారా బరువు తగ్గే అవకాశం ఉంటుంది. ఇది తేలికపాటి వంటకం. దీంతోపాటు ఇందులో ప్రొటీన్లు, ఫైబర్ అధికంగా ఉండటం వల్ల పొట్ట ఎక్కువసేపు నిండుగా ఉండేలా చేస్తుంది. ఆ క్రమంలో మధ్యాహ్న భోజనం చేయడం ఆలస్యం కావచ్చు. అయితే కొంత మందికి మాత్రం ఇడ్లీ చాలా సులువుగా డైజెస్ట్ అవుతుంది.
ప్రోటీన్లు అధికం
ఇడ్లీల ద్వారా ఆరోగ్యానికి మంచి ప్రోటీన్లు లభిస్తాయి. దీంతోపాటు శరీరానికి అవసరమైన అమైనో ఆమ్లాలు అందడంతోపాటు మెరుగైన శోషణకు అవకాశం ఉంటుంది.
ఫైబర్, ఐరన్ పుష్కలం
ఇడ్లీలలో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుందని చెప్పవచ్చు. ఇది జీర్ణక్రియను సులభతరం చేస్తుంది. ఇది పప్పుతో తయారు చేయబడినందున, ఇందులో ఇనుము కూడా సమృద్ధిగా ఉంటుంది.
మెరుగైన శోషణ
మనవ శరీరానికి అవసరమైన అన్ని అమైనో ఆమ్లాలను ఇడ్లీల ద్వారా లభిస్తాయని పలువురు అంటున్నారు. తద్వారా మెరుగైన శోషణ జరిగి ఆరోగ్యంగా ఉండేందుకు అవకాశం ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
మంచి జీర్ణక్రియ
ఇడ్లీలు ఆహారంలో తీసుకోవడం ద్వారా మెరుగైన జీర్ణక్రియకు తోడ్పడుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. కిణ్వ ప్రక్రియ కారణంగా ఇడ్లీలు ప్రోబయోటిక్స్ ద్వారా కొన్ని సూక్ష్మజీవులను నియంత్రిస్తాయని అంటున్నారు.