స్టార్ ఇండియా క్రికెటర్ విరాట్ కోహ్లీ(virat Kohli) గురువారం తన 10వ తరగతి మార్కు షీట్‌కి(10th class marks sheet) సంబంధించిన చిత్రాన్ని సోషల్ మీడియా(social media)లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ మార్క్స్ మోమో నెట్టింట చక్కర్లు కోడుతుంది. అయితే కోహ్లీకి ఎన్ని మార్కులు వచ్చాయో మీరు కూడా ఓసారి తెలుసుకోండి మరి.
మీకు స్టార్ క్రికెటర్, భారత మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ(virat Kohli)కి 10వ తరగతిలో ఎన్ని మార్కులు(10th class mark list) వచ్చాయో తెలుసా? తెలియదా అయితే ఈ వార్తను చదవండి మీకే తెలుస్తుంది. ఇటీవల విరాట్ తనకు 10వ తరగతిలో వచ్చిన మార్కుల జాబితా మోమోను సోషల్ మీడియాలో పంచుకున్నారు. అతను ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) రాబోయే సీజన్‌కు సిద్ధమవుతున్న నేపథ్యంలో కోహ్లీ తన టెన్త్ క్లాస్ మార్క్‌షీట్(mark sheet)ను సోషల్ మీడియా(social media) ప్లాట్‌ఫామ్ కూ ద్వారా పంచుకున్నారు.
విరాట్ తన హైస్కూల్ పరీక్షలో ఎలా రాణించాడో చెబుతూ, కోహ్లీ ఇంగ్లీష్‌లో 83, హిందీలో 75, గణితంలో 51, సైన్స్ & టెక్నాలజీలో 55, సోషల్ సైన్స్‌లో 81, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 74 మార్కులు సాధించాడు. మరోవైపు మరికొన్ని రోజుల్లో 10వ తరగతి బోర్డు పరీక్షా ఫలితాలు జరగనున్న నేపథ్యంలో విరాట్ కోహ్లీ పోస్ట్ చేసిన మార్క్‌షీట్ చర్చనీయాంశంగా మారింది.
విరాట్ 2004లో 10వ తరగతి చదువుతున్నప్పుడు విద్యార్థి జీవితంలో క్రీడలు ముఖ్యమైన పాత్ర పోషిస్తాయనే వాస్తవాన్ని నొక్కి చెప్పినట్లు తెలుస్తోంది. అతను 2004లో 10వ తరగతి చదువుతున్నప్పుడు అతని పాఠ్యాంశాల్లో స్పోర్ట్స్ ఎలా తప్పిపోయిందని ప్రస్తావించారు. అయితే ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల కోహ్లీ వెంటనే ఈ పోస్ట్‌ను తొలగించారు. ఐపీఎల్ కోసం సిద్ధమవుతున్న ఆర్సీబీ ఇక ఐపీఎల్లో పోటీలో ఈ మార్క్ షీట్లు పెద్దగా ప్రభావం చూపవని ప్రస్తావించారు. ఇది చూసిన అభిమానులు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
అంతేకాదు విరాట్ 19 ఏళ్ల వయసులోనే 2008లో ఆర్సీబీ(RCB) జట్టులో చేరారు. అప్పటి నుంచి ఇప్పటివరకు వరుసగా 15 సీజన్లు ఆడి రికార్డు సృష్టించారు. ఇప్పుడు 16వ సీజన్ కూడా ఆడేందుకు సిద్ధమయ్యారు. అయితే ఇన్ని సార్లు విరాట్ ఆడినా కూడా ఆర్సీబీ జట్టు టైటిల్ గెల్చుకోకపోవడంపై అభిమానులు నిరాశ చెందుతున్నారు.