రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో రిలయన్స్ మద్దతుగల జియో(jio) నుంచి సరికొత్త ప్లాన్ అందుబాటులోకి వచ్చింది. JioFiber “బ్యాక్-అప్ ప్లాన్” జియో రూ.198కే అందిస్తున్నట్లు ప్రకటించింది. దీని ద్వారా కొత్త ప్లాన్ వినియోగదారులకు అపరిమిత 10 Mbps డేటాను అందించనున్నట్లు వెల్లడించింది.
రేపటి నుంచి ఐపీఎల్ 2023(ipl 2023) టోర్నీ మొదలు కానుంది. ఈ క్రమంలో ముఖేష్ అంబానీ నేతృత్వంలోని టెల్కో కంపెనీ జియో(jio) ఐపీఎల్ అభిమానుల కోసం సరికొత్త బ్రాడ్‌బ్యాండ్ ప్లాన్ ను ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో అతిపెద్ద క్రికెట్ టోర్నమెంట్‌ను అంతరాయం లేకుండా చూసేందుకు ఇలాంటి అవకాశాన్ని ఉపయోగించుకోవాలని జియో వెల్లడించింది.
అయితే కొత్త ప్లాన్ ధర రూ.198గా ప్రకటించారు. ఈ నేపథ్యంలో వినియోగదారులకు 10 Mbps నుంచి 30Mbps లేదా 100Mbps వరకు స్పీడ్‌ని 1/2/7 రోజుల ఎంపికలతో అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం ఉన్నట్లు ప్రకటించారు. దీంతోపాటు వినియోగదారులకు ఉచిత STB, OTT సబ్స్క్రిప్షన్లను అప్‌గ్రేడ్ చేసుకునే సదుపాయం కూడా ఉన్నట్లు వెల్లడించారు.
ఇది బడ్జెట్ బ్రాడ్ బ్యాండ్ కనెక్షన్‌గా కూడా ఉపయోగపడుతుంది. ప్రత్యేకించి అన్ కనెక్ట్ చేయబడిన గృహాలు, ఇతర ఫిక్స్డ్ లైన్ కనెక్షన్‌తో ప్రారంభించబడుతున్న వారికి ఇది మంచి అవకాశమని పేర్కొన్నారు. ఈ కొత్త JioFiber బ్యాక్-అప్ కనెక్షన్ 30 మార్చి, 2023 నుంచి అందుబాటులో ఉంటుందని కంపెనీ ప్రతినిధులు స్పష్టం చేశారు.
కొత్త బ్యాకప్ ప్లాన్ వినియోగదారులు 30 రోజుల పాటు 10 Mbps వద్ద అపరిమిత బ్యాండ్‌విడ్త్‌ను యాక్సెస్ చేయవచ్చు. అవసరమైన విధంగా స్పీడ్ అప్‌గ్రేడ్ వోచర్లను కొనుగోలు చేయడం ద్వారా వీటిని పొందవచ్చు. ఈ JioFiber బ్యాకప్ ప్లాన్‌ని ఎంచుకునే కస్టమర్లు 10 Mbps నుంచి 30 Mbps లేదా 100 Mbpsకి 1 రోజు, 2 రోజులు లేదా 7 రోజుల పాటు అప్‌గ్రేడ్ చేసుకునే అవకాశం కూడా ఉంది.
JioFiber కొత్త ప్రోగ్రామ్ ప్రస్తుత కస్టమర్లు నిర్బంధ కాలానికి స్పీడ్ అప్‌గ్రేడ్‌ని పొందేలా చేస్తుంది. దీని ద్వారా అదనంగా లైవ్ స్పోర్ట్స్ వంటి హై-బ్యాండ్‌విడ్త్ కంటెంట్‌ను స్ట్రీమింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మరోవైపు కొత్త ఇంటర్నెట్ కనెక్షన్‌ను “బ్యాకప్”గా జోడించాలనుకునే జియో ఫైబర్ కాని వినియోగదారుల కోసం కూడా ఈ డీల్ అందుబాటులో ఉంటుంది. జియో ప్రస్తుతం ఫిక్స్డ్ లైన్ కనెక్షన్ విభాగంలో 30.6 శాతం మార్కెట్ వాటాతో 84 లక్షల మంది కస్టమర్లతో అగ్రగామిగా ఉంది. కొత్త కస్టమర్లు రూ.1,490 సేవ కోసం ఐదు నెలల వినియోగం, ఇన్స్టాలేషన్ ఛార్జీలు ఉంటాయి.