బాలీవుడ్ సూపర్ స్టార్ షారుఖ్ ఖాన్(Shah Rukh Khan) నటిస్తున్న 'జవాన్'లోని యాక్షన్ సీక్వెన్స్ ఆన్‌లైన్‌లో లీక్ అయి సోషల్ మీడియా(social media)లో దుమారం రేపుతోంది. దాదాపు ఐదు నుంచి ఆరు సెకన్ల నిడివి గల చిన్న క్లిప్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. 'పఠాన్' స్టార్ పొట్టి జుట్టుతో నోటిలో సిగార్ పట్టుకుని గూండాలను బెల్ట్‌తో కొడుతున్న వీడియో స్లో మోషన్‌లో కనిపిస్తుంది. ఇది చూసిన అభిమానులు సూపర్ అని కామెంట్ల...
delhi liquor scam:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఈడీ అధికారులు (ed) ప్రశ్నిస్తున్నారు. ఈ కుంభకోణంలో ఇప్పటికే 11 మందిని అరెస్ట్ చేయడంతో ఈ కేసుకు హైప్ నెలకొంది.
ఇంకేం కావాలి నాకు 20 సంవత్సరాల నా సినీ ప్రయాణంలో మరిచిపోలేని రోజును చిరంజీవి గారు నాకు ఇచ్చారు. థాంక్యూ సో మచ్ సార్. నా జీవితాంతం గుర్తుండిపోయే క్షణం నాకు. ఇది నా బలగం విజయం.
షాంఘై మాజీ కమ్యూనిస్ట్ పార్టీ చీఫ్ లీ కియాంగ్(Li Qiang) చైనా(china) కొత్త ప్రధానిగా నియమితులయ్యారు. సెంట్రల్ బీజింగ్‌లోని గ్రేట్ హాల్ ఆఫ్ పీపుల్ లోపల జరిగిన సమావేశంలో లీ 2,936 ఓట్లను పొందాడు. వ్యతిరేకంగా మూడు ఓట్లు రాగా, ఎనిమిది మంది గైర్హాజరయ్యారు.
అన్ని ఏర్పాట్లు చేసుకుంటుండగా గుండెపోటుకు గురై మృతి చెందడంతో పార్టీ నాయకులు దిగ్భ్రాంతికి లోనయ్యారు. ఆయన మృతితో పార్టీకి తీరని నష్టం చేకూరింది. ఆయన ప్రభావం దాదాపు ఐదు నియోజకవర్గాల్లో ఉండేది. ఫలితంగా ఆయన లోటు భర్తీ చేయలేనిదని స్థానిక కాంగ్రెస్ నాయకులు చెబుతున్నారు.
ఏపీ ప్రభుత్వం(ap government) 11వ పీఆర్సీ హామీలతోపాటు పెండింగ్ బిల్లులు, బకాయిలు సహా అనేక సమస్యలను నెరవేర్చలేదని ఏపీ జేఏసీ నేత బొప్పరాజు వెంకటేశ్వర్లు(bopparaju venkateswarlu) అన్నారు. ఈ క్రమంలో తన నిరసనను ఏప్రిల్ 5 వరకు కొనసాగిస్తామని స్పష్టం చేశారు. మరోవైపు ప్రభుత్వం పెండింగ్ బిల్లులు ఇవ్వకుండా ఉద్యోగులను రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తుందని ఆరోపించారు.
11th number:బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు (kavitha) 11వ నంబర్ (11th number) కలిసి రావడం లేదు. అవును ఈ రోజు (మార్చి 11వతేదీన) ఆమె ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో (delhi liquor scam) ఈడీ (ed) విచారణకు హాజరవుతారు. గతేడాది డిసెంబర్ 11వ తేదీన (december 11th) ఉదయం 11 గంటలకు (11am) కవితను (kavitha) ఆమె నివాసంలోనే సీబీఐ అధికారులు (cbi) విచారించిన సంగతి తెలిసిందే.
పార్టీ తరఫున పెద్ద ఎత్తున ఆందోళనలు చేపట్టాలనే భావిస్తున్నారు. అయితే అక్కడ 144 సెక్షన్ అమల్లో ఉందని పోలీసులు సూచిస్తున్నారు. ఎలాంటి ర్యాలీలకు అనుమతి లేదని ఢిల్లీ పోలీసులు చెబుతున్నారు.
Moto సంస్థ నుంచి సరికొత్త G73 5G స్మార్ట్ ఫోన్ దేశీయ మార్కెట్లోకి వచ్చింది. 8GB RAM, 256GB సపోర్ట్, 50MP ప్రధాన కెమెరా, 8MP సెకండరీ కెమెరా ఉన్న ఈ ఫోన్ రూ.16,999కే లభించనుంది. మార్చి 16 నుంచి ఈ పోన్ పలు స్టోర్లతోపాటు అధికారిక వెబ్ సైట్ సహా ఫ్లిప్ కార్టు(Flipkart)లో ఆన్ లైన్లో అందుబాటులో ఉంటుంది.
26 questions:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రోజు సీఎం కేసీఆర్ (cm kcr) తనయ, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను (kavitha) ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ed) అధికారులు విచారించనున్నారు. విచారణ అనంతరం ఆమెను అరెస్ట్ చేస్తారనే ఊహాగానాలు జోరుగా వినిపిస్తున్నాయి. ఈ విషయాన్ని నిన్న సీఎం కేసీఆరే (cm kcr) స్వయంగా చెప్పారు కూడా.
అంతకుముందు క్రాంతికి ‘ఐ లవ్యూ.. లాస్ట్ మెసేజ్’ అని వాట్సప్ సందేశం పంపింది. అనంతరం ఫోన్ స్విచ్ఛాఫ్ చేయడంతో భయాందోళన చెందిన క్రాంతి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లిదండ్రులు, పోలీసులు గాలించగా గ్రామ శివారులో అచేతనావస్థలో కనిపించింది.
ఢిల్లీ లిక్కర్ స్కాం(Delhi Liquor Scam) కేసులో కల్వకుంట కవిత(kavitha)కు సీబీఐ విచారణ, ఈడీ నోటీసులు వస్తే తెలంగాణ ప్రజలకు సంబంధం లేదని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి(revanth reddy) తెలిపారు. ఈ క్రమంలో ప్రజలు కేసీఆర్(kcr) ఫ్యామిలీపై సానుభూతి చూపించొద్దని అన్నారు. ఈ క్రమంలో గల్లీలో కవిత అయ్య కేసీఆర్(kcr), ఢిల్లీలో బిడ్డ లిక్కర్ స్కాం దాందా నిర్వహిస్తున్నారని రేవంత్ ఆరోపించారు. ఆ క్రమంలో వేల కోట...
ఓ 10 ఏళ్ల బాలిక(10 years old girl) తన అమ్మమ్మ గొలుసును లాక్కోవడానికి వచ్చిన దొంగను(thief) చితకబాదింది. దీంతో చైన్ స్నాచర్ పారిపోయాడు. ఫిబ్రవరి 25న జరిగిన ఈ ఘటన అక్కడి సీసీటీవీ కెమెరాలో రికార్డయింది. అందుకు సంబంధించిన వీడియో వైరల్(viral video) కావడంతో మార్చి 8న ఎఫ్ఐఆర్ నమోదైంది. ఈ ఘటన మహారాష్ట్రలోని పూణె(pune)లో జరిగింది.
తెలంగాణ(telangana) రాష్ట్రానికి 63 కిలోమీటర్ల నాలుగు లేన్ల రహదారి మార్గాన్ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. దీనిని హైదరాబాద్-రాయ్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌వేలో(Hyderabad Raipur expressway) భాగంగా బెల్లంపల్లి నుంచి గడ్చిరోలి(Bellampalli to Gadchiroli) వరకు రోడ్డు మార్గాన్ని విస్తరించనున్నారు. ఈ సరిహద్దు ప్రాజెక్టు విలువ రూ.43,000 కోట్లు కాగా..2025 ఆగస్టు నాటికి పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది.
వైద్యులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తలు తీసుకోమని సూచిస్తున్నారు. వ్యాయామం, పౌష్టికాహారం తీసుకోవాలని చెబుతున్నారు. ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం చేయొద్దని హెచ్చరిస్తున్నారు.