ప్రస్తుతం వాటి ఆలనాపాలనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వాటి సంఖ్య పెరిగేందుకు అటవీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఓ చీతా నాలుగింటికి జన్మనివ్వడంతో భారత్ లో మళ్లీ చీతాల సంఖ్య పెరుగుతుందని అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
భారతదేశంలో చీతాల (Cheetahs) సంఖ్య పెరుగుతోంది. ఇప్పటికే నమీబియా (Namibia) నుంచి తీసుకొచ్చిన చీతాలు భారత్ (India)లో సంతోషంగా జీవిస్తున్నాయి. అక్కడి నుంచి తీసుకొచ్చిన వాటిలో ఇటీవల ఒక చీతా అనారోగ్యంతో మృతి (Cheetah Died) చెందగా.. తాజాగా ఓ చీతా ఓ నాలుగు (Cubs) పిల్లలకు జన్మనిచ్చింది. చీతా పిల్లలకు జన్మనివ్వడంపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi), కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ (Bhupender Yadav) హర్షం వ్యక్తం చేశారు. ‘చరిత్రాత్మకమైన క్షణం’గా అభివర్ణించారు.
గతేడాది సెప్టెంబర్ 17వ తేదీన నమీబియా దేశం నుంచి ప్రత్యేక విమానంలో భారతదేశానికి 8 చీతాలు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. మధ్యప్రదేశ్ (Madhya Pradesh)లోని షియోపూర్ జిల్లాలో (Sheopur District) ఉన్న కునో జాతీయ పార్క్ (Kuno National Park)లో ఈ చీతాలు ఉంటున్నాయి. అయితే వీటిలో నాలుగున్నర వయసున్న ఓ చీతా సోమవారం మృతి చెందింది. అయితే ఉన్న ఏడింటిలో ఒక చీతా బుధవారం నాలుగు కూనలకు జన్మనిచ్చింది. దీంతో కేంద్ర అటవీ శాఖ మంత్రి భూపేందర్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. మోదీ ఆదర్శ పాలనకు నిదర్శనం అని పేర్కొన్నారు. కాగా ఈ వార్తపై ప్రధాని మోదీ హర్షం వ్యక్తం చేశారు. అద్భుతమైన వార్త అంటూ ట్వీట్ (Tweet) చేశారు.
తన జన్మదినం సందర్భంగా ప్రధాని మోదీ 8 చీతాలు (5 ఆడ, 3 మగ పులులు) తీసుకొచ్చారు. అనంతరం దక్షిణాఫ్రికా (South Africa) నుంచి 12 చీతాలను ఈ ఏడాది ఫిబ్రవరి 18వ తేదీన భారత్ కు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. ఆ చీతాలు అన్ని మధ్యప్రదేశ్ లోని కునో పార్కులో (Kuno Park) ఉంటున్నాయి. ప్రస్తుతం వాటి ఆలనాపాలనపై ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాయి. వాటి సంఖ్య పెరిగేందుకు అటవీ శాఖ ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఈ క్రమంలోనే ఓ చీతా నాలుగింటికి జన్మనివ్వడంతో భారత్ లో మళ్లీ చీతాల సంఖ్య పెరుగుతుందని అటవీ అధికారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.