»Vijayawada To Kuwait Air India Flight Under Fire For Leaving Over 11 Passengers In Gannavaram
Air India flight: గన్నవరంలో ప్రయాణీకులను వదిలేసి, కువైట్ వెళ్లిన విమానం
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (vijayawada international airport).. గన్నవరం (gannavaram airport) నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు (International flights) ప్రారంభిస్తున్నారు.
విజయవాడ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ (vijayawada international airport).. గన్నవరం (gannavaram airport) నుండి పూర్తిస్థాయిలో అంతర్జాతీయ విమాన సర్వీసులు (International flights) ప్రారంభిస్తున్నారు. గన్నవరం విమానాశ్రయం (Gannavaram Air Port to Kuwait flights) నుండి నేరుగా కువైట్ సమ్మర్ ఎయిర్ ఇండియా సర్వీసెస్ ను (Air India services) బుధవారం ప్రారంభించారు. అయితే మొదటి రోజునే ప్రయాణీకులకు గట్టి షాక్ తగిలింది. ఈ విమానం ప్రయాణీకులను (Passengers) వదిలేసి, వెళ్లిపోవడంతో విమానాశ్రయంలో గందరగోళ పరిస్థితి ఏర్పడింది. ఇప్పటి వరకు ఏపీ నుండి… అన్ని ప్రాంతాలకు వెళ్లేందుకు సరైన విమాన సౌకర్యం లేదు. హైదరాబాద్ (Hyderabad) లేదా బెంగళూరు (Bengaluru) లేదా చెన్నై (Chennai) ఇలా ఇతర ప్రాంతాలకు వెళ్లవలసి వస్తోంది. ఈ నేపథ్యంలో నేటి నుండి కువైట్ విమాన సర్వీసును ప్రారంభించింది ఎయిరిండియా. కానీ ప్రయాణీకులను తీసుకొని వెళ్లలేదు.
ఎయిరిండియా కువైట్ విమానం షెడ్యూల్ ప్రకారం బుధవారం ఉదయం గం.9.55 నిమిషాలకు విజయవాడలో బయలుదేరి, మధ్యాహ్నం రెండున్నర గంటలకు కువైట్ చేరుకుంటుంది. ఆ తర్వాత కువైట్ లో సాయంత్రం గం.3.40 నిమిషాలకు బయలుదేరి, రాత్రి గం.8.35కు గన్నవరం చేరుకుంటుంది. ఈ రోజు గన్నవరం నుండి ప్రారంభమైన విమానం 11 వరకు ప్రయాణీకులను తీసుకొని వెళ్లలేదు. విమానం గం.9.55కు బయలుదేరుతుంది. కానీ వారికి ఇచ్చిన టిక్కెట్లలో మధ్యాహ్నం గం.1.10 అని ఉంది. గన్నవరం నుండి కువైట్ కు 85 మంది ప్రయాణీకులు టిక్కెట్లు బుక్ చేసుకోగా, 67 మంది మాత్రమే వెళ్లారు. టిక్కెట్ పైన తప్పుగా ముద్రించడంతో 11 మంది ఆలస్యంగా వచ్చారు. డబ్బులు రీఫండ్ చేస్తామని సిబ్బంది చెప్పడంతో ఎయిరిండియా సిబ్బందితో ప్రయాణీకులు వాగ్వాదానికి దిగారు. విమానం 9.55కి బయలుదేరుతుందని తాము మెసేజ్ పెట్టామని సిబ్బంది చెబుతుండగా, అలాంటిదేమీ రాలేదని ప్రయాణీకులు అంటున్నారు. ఈ సమ్మర్ ఎయిరిండియా సర్వీస్ ను నేటి నుండి అక్టోబర్ వరకు నడపనున్నారు.