»Nithyanandas Fictional Nation Of Kailasa Worms Way Into Un Panel Discussion 2
United States of KAILASA: నిత్యానందపై ప్రతినిధులపై ఐరాస స్పందన
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద (self-proclaimed god man Nithyananda) కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో ఐక్య రాజ్య సమితి (united nations organization) చర్చలో పాల్గొనడంపై ఐక్య రాజ్య సమితి ప్యానల్ స్పందించింది.
పరారీలో ఉన్న స్వయంప్రకటిత గాడ్-మ్యాన్ నిత్యానంద (self-proclaimed god man Nithyananda) కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో ఐక్య రాజ్య సమితి (united nations organization) చర్చలో పాల్గొన్న విషయం తెలిసిందే. తద్వారా తమను ప్రపంచ సంస్థ గుర్తించిందనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టిస్తున్నారు. అయితే కైలాస దేశ ప్రతినిధులు హాజరు కావడంపై ఐక్య రాజ్య సమితి ప్యానల్ స్పందించింది. స్వయం ప్రకటిత సంస్థల ప్రతినిధులు అందించిన సమాచారాన్ని తాము పరిగణలోకి తీసుకునేది లేదని తెలిపింది.
ఐక్య రాజ్య సమితిలో (united nations organization) జరిగే సాధారణ సమావేశాల్లో ఎవరైనా పాల్గొని రాతపూర్వకంగా తమ అభిప్రాయం చెప్పవచ్చునని తెలిపింది. దీంతో సమావేశం నిర్వహించే కమిటీలకు వేర్వేరు వ్యక్తుల వ్యక్తిగత లేదా వివిధ సంఘాల ప్రతినిధుల అభిప్రాయం తెలుసుకునే అవకాశం మాత్రమే లభిస్తుందని తెలిపింది. ఇందులో భాగంగా ఫిబ్రవరి 24న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ సుస్థిర అభివృద్ధి అంశంపై బహిరంగ చర్చా వేదికను నిర్వహించగా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (United States of KAILASA) ప్రతినిధులమని చెబుతూ ఇద్దరు వ్యక్తులు పాల్గొన్నారని చెప్పారు. ఇక్కడ కైలాస శాశ్వత రాయబారినంటూ (permanent ambassador of Kailasa) విజయప్రియ నిత్యానంద (Vijayapriya Nithyananda) చేసిన వ్యాఖ్యలను కమిటీ పరిగణలోకి తీసుకోదని చెప్పారు. ప్రజా స్పందనలో భాగంగా మాత్రమే వారు చెప్పారని వెల్లడించారు.
ఏం జరిగింది?
నిత్యానంద కల్పిత దేశం యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాసకు (United States of KAILASA) చెందిన ప్రతినిధులు జెనీవాలో స్థిర అభివృద్ధిపై చర్చ సందర్భంగా పాల్గొన్నారు. తద్వారా వరల్డ్ ఆర్గనైజేషన్ ఐక్య రాజ్య సమితి (united nations organisation) తమను గుర్తించిందనే తప్పుడు అభిప్రాయాన్ని సృష్టించే ప్రయత్నం చేశాడు నిత్యానంద. ఫిబ్రవరి 24న ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక హక్కుల కమిటీ (Committee on Economic, Social and Cultural Rights-CESCR) నిర్వహించిన సుస్థిర అభివృద్ధిపై జరిగిన సాధారణ చర్చలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస (United States of KAILASA)కు చెందిన ఇద్దరు… ప్రజా స్పందనలో భాగంగా మాట్లాడారు. జెనీవాలోని (Geneva) ఐక్య రాజ్య సమితి మానవ హక్కుల సంస్థలు.. ప్రజలను తమ ఓపెన్ సెషన్ లలోకి రావడానికి, అక్కడ మాట్లాడటానికి అనుమతిస్తాయి. ప్రజలు, సంస్థలు తమ విధానాలను సమర్పించేందుకు వీలు కల్పిస్తాయి.
ఇందులో భాగంగా తలపాగా చుట్టి, నుదుటిన బొట్టు పెట్టి, ఆభరణాలు ధరించిన నిత్యానంద దేశానికి చెందిన విజయప్రియ నిత్యానంద మాట్లాడింది. యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ కైలాస గురించి మాట్లాడారు. తమ దేశంలో ప్రాథమిక అవసరాలైన కూడు, గుడ్డ, దుస్తులు, విద్య, వైద్యం ఉచితంగా అందిస్తున్నట్లు చెప్పింది. మొదట కైలాస దేశ విశిష్టతను వివరించింది. కైలాస దేశం హిందువుల కోసమే ఏర్పడిన మొట్టమొదటి సార్వభౌమ దేశం అని పేర్కొన్నది. తమ దేశాధినేత పేరు నిత్యానంద పరమశివం అని, నిత్యానంద పరమశివం పరమావధి హిందూ మత పునరుజ్జీవం అని స్పష్టం చేసింది. వారి అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ కైలాసాస్ ఎస్పీహెచ్ నిత్యానంద (KAILASA’s SPH Nithyananda) ఇందుకు సంబంధించిన ఫోటోలను షేర్ చేసి, తమకు గుర్తింపు లభించినట్లుగా చెప్పే ప్రయత్నం చేసింది. ఇందులో ఐక్య రాజ్య సమితి కైలాస శాశ్వత అంబాసిడర్ గా విజయప్రియ నిత్యానందను పేర్కొన్నారు. ఇప్పుడు ఈ పోటోలు ఇంటర్నెట్ లో హల్ చల్ గా మారాయి.