MP Midhun Reddy: లోకేష్ భయపెడుతున్నారు, అక్కడ సెల్ఫీ దిగు
తెలుగు దేశం పార్టీ ( Telugu Desam Party ) జాతీయ ప్రధాన కార్యదర్శి ( tdp national general secretary ) నారా లోకేష్ ( Nara Lokesh ) పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) పార్లమెంటు సభ్యులు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ( P. V. Midhun Reddy , MP ) షాకింగ్ కామెంట్స్ చేసారు .
తెలుగు దేశం పార్టీ ( Telugu Desam Party ) జాతీయ ప్రధాన కార్యదర్శి ( tdp national general secretary ) నారా లోకేష్ ( Nara Lokesh ) పైన వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ( ysr congress party ) పార్లమెంటు సభ్యులు పెద్ది రెడ్డి మిథున్ రెడ్డి ( P. V. Midhun Reddy , MP ) షాకింగ్ కామెంట్స్ చేసారు . లోకేష్ తన పాదయాత్రలో ప్రజలను భయపెడుతూ , అర్థం కాని రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు . ఆయన హైదరాబాద్ లో (hyderabad) ఉండి పెరిగారని, అలాంటి వ్యక్తికి చిత్తూరు జిల్లా (Chittoor Dist) గురించి ఏం తెలుసునని ప్రశ్నించారు . చవకబారు మాటలతో మీ కుటుంబాన్ని మీరే రోడ్డు మీదకు లాక్కోవద్దని హెచ్చరించారు . మీ తండ్రి, మాజీ ముఖ్యమంత్రి ( Former Chief Minister of Andhra Pradesh ) నారా చంద్రబాబు నాయుడును ( Nara chandrababu Naidu ) చిత్తూరు ప్రజలు ఎవరూ నమ్మడం లేదని విమర్శించారు . గత కొద్ది రోజులుగా చిత్తూరు జిల్లాలో లోకేష్ ( Nara Lokesh ) ఎదుటి వారిని తిట్టడానికే పాదయాత్ర ( padayatra ) చేస్తున్నారని ధ్వజమెత్తారు . అసలు ఆయన పాదయాత్ర ( Yuva galam Padayatra ) ఎందుకు చేస్తున్నారో ఆయనకే తెలియదని , కారణాలు ఏమిటో ప్రజలకు తెలియ జెప్పాలని హితవు పలికారు .
అయిదేళ్ల పాటు 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్న తెలుగు దేశం పార్టీ ( Telugu Desam party) ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని ఆరోపించారు . అలాంటి లోకేష్ తన పాదయాత్ర సమయంలో టీడీపీ ( TDP ) అధికారంలోకి వస్తే విద్యా దీవెన ( vidya deevena ), వసతి దీవెన ( vasathi deevena ) వంటి అద్భుత పథకాలను ( YSRCP government schemes ) ఆపివేస్తామని ప్రజలను భయపెడుతున్నారని చెప్పారు . పేద ప్రజలు బాగు పడటం చూసి ఆయన ఓర్చుకోలేకపోతున్నట్లుగా ఉందని వ్యాఖ్యానించారు . జగన్ ముఖ్యమంత్రి ( chief minister of andhra pradesh ) అయినప్పటి నుండి ఆంధ్ర ప్రదేశ్ అభివృద్ధిలో పరుగులు తీస్తోందని చెప్పారు . ప్రధానంగా చిత్తూరు జిల్లాలోని ( Chittoor District ) తంబళ్లపల్లె నియోజకవర్గంలో ( thamballapalle assembly constituency ) వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేస్తున్నామని చెప్పారు . అసలు తెలుగు దేశం పార్టీ ( Telugu Desam party )1996 నుండి ఎప్పుడైనా ఈ జిల్లాలో మెజార్టీ సీట్లు సాధించిందా చెప్పాలని నిలదీశారు . పుంగనూరు నియోజకవర్గంలో ( punganur assembly constituency ) అయిదు సంవత్సరాల క్రితం ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆరోపించారు . తమ ప్రభుత్వం అధికారంలోకి ( YSR Congress Party ) వచ్చాక మాత్రం 500 కిలో మీటర్ల మేర రోడ్లు వేసిందని గుర్తు చేసారు . మదనపల్లిలో మెడికల్ కాలేజీ ( madanapalle medical college ) ఏర్పాటు చేశామని, ఆ ప్రాంతంలో రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు వేగంగా సాగుతున్నాయని చెప్పారు . తాము చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక పోతున్నారన్నారు . లోకేష్ టీడీపీ హయాంలో ఇంత చేశామంటూ సెల్ఫీలు దిగుతున్నారని, కానీ వైసీపీ చేసిన అభివృద్ధి పనుల వద్దకు వెళ్లి కూడా అదే చేయాలని హితవు పలికారు .