ఆర్ఆర్ఆర్, కెజీయఫ్ చాప్టర్ 2 తర్వాత పాన్ ఇండియా స్థాయిలో వచ్చిన లైగర్ మూవీ.. భారీ హైప్ క్రియేట్ చేసింది. దాంతో బాక్సాఫీస్ వద్ద లైగర్ దుమ్ముదులపడం పక్కా అనుకున్నారు. అంతేకాదు భారీ ఓపెనింగ్స్ రాబడుతుందని అనుకున్నారు. అయితే ఫస్ట్ షోకే లైగర్ సీన్ రివర్స్ అయిపోయింది. ఒక్కసారిగా సోషల్ మీడియాలో నెగెటివ్ టాక్ స్ప్రెడ్ అవడంతో.. లైగర్ వసూళ్ల పై భారీ ఎఫెక్ట్ చూపించింది. దాంతో మిక్స్డ్ టాక్‌తో సరిపెట్టుకున్నాడు రౌడీ హీరో. ఫస్ట్ డే వరల్డ్ వైడ్‌గా 33 కోట్ల గ్రాస్ అందుకున్న ఈ సినిమా.. ఆ తర్వాత ఆశించిన స్థాయిలో వసూళ్లను రాబట్టేకపోయింది. విజయ్ దేవరకొండ కెరీర్లో హెయ్యెస్ట్ ఓపెనింగ్స్ రాబట్టినప్పటికీ.. అంచనాలను మాత్రం అందుకోలేకపోయింది లైగర్.
అయితే హిందీలో మాత్రం లైగర్‌కు మంచి వసూళ్లే దక్కుతున్నట్టు బీ టౌన్ ట్రేడ్ వర్గాలంటున్నాయి. దాంతో నెక్స్ట్ వీకెండ్ వరకు ఓ మోస్తరు కలెక్షన్లు రాబట్టినా.. బాలీవుడ్లో బ్రేక్ ఈవెన్ చేసుకునే ఛాన్స్ ఉందంటున్నారు. అయితే తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నష్టాలు తప్పేలా లేవంటున్నారు. కేవలం తెలుగు అనే కాదు మొత్తంగా కలిపి లైగర్‌కు 50 కోట్ల నష్టం వచ్చే ఛాన్స్ ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఈ సినిమా బిజినెస్ దాదాపు 90 కోట్ల వరకు జరిగిందని టాక్. అయితే మేకర్స్‌ను డిజిటల్, శాటిలైట్ రైట్స్ కలిపి లైగర్ గట్టెక్కించినా.. డిస్ట్రిబ్యూటర్స్‌కు మాత్రం నష్టాలు మిగల్చడం ఖాయమంటున్నారు. ఇక్కడ మరో విశేషమేటంటే.. తెలుగులో ఆచార్య డిప్ట్రిబ్యూట్ చేసిన వరంగల్ శ్రీనునే.. లైగర్ డిస్ట్రిబ్యూషన్ కూడా దక్కించుకున్నాడు. కానీ ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా కొట్టడంతో.. వరంగల్ శ్రీనుకి భారీ దెబ్బే అని చెప్పొచ్చు. ఈ నేపథ్యంలో అటు పూరిని, విజయ్ను ట్రోల్ చేస్తున్నారు నెటిజన్స్. ముఖ్యంగా ఐదేళ్ల క్రితం ఆగష్టు 25న అర్జున్ రెడ్డి సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్న విజయ్ దేవరకొండ.. అదే రోజు భారీ ఫ్లాప్ అందుకున్నాడని కామెంట్ చేస్తున్నారు.