»Konda Murali If You Touch Congress Workers You Will Be Thrown To The Crane Konda Murali Warns
Konda Murali: కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే క్రేన్‌కు ఉరేస్తా.. కొండా మురళి వార్నింగ్
వరంగల్ కాంగ్రెస్ కార్తకర్తల్లో అంతర్గత విభేదాలు చెలరేగాయి. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణం చేస్తుండగా గొడవ జరిగింది. కొండా మురళి, ఎర్రబెల్లి స్వర్ణ అనుచరులు, కార్యకర్తలు ఒకరిపై ఒకరు దాడులు చేసుకున్నారు.
కాంగ్రెస్(Congress) కార్యకర్తలకు ఏం జరిగినా తాను సహించలేనని, తన అనుచరులకు ఏ ఇబ్బంది వచ్చినా వదిలిపెట్టనని కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళి(Konda Murali) వార్నింగ్ ఇచ్చారు. కాంగ్రెస్ కార్యకర్తలను టచ్ చేస్తే వారిని క్రేన్‌కు ఉరేస్తానని హెచ్చరించారు. తమ కార్యకర్తలకు, అనుచరులకు ఏం జరిగినా మొదట తాము పోలీసుల(police)కు ఫిర్యాదు చేస్తామని, వాళ్లు కూడా చర్యలు తీసుకోకపోతే పాత కొండా మురళి బయటికొస్తాడని కీలక వ్యాఖ్యలు చేశారు.
వరంగల్‌లో కాంగ్రెస్ కార్యకర్తల మధ్య తోపులాట వీడియో:
వరంగల్ కాంగ్రెస్ పార్టీలో వర్గ పోరు, ఒకరినొకరు పొట్టు పొట్టు తన్నుకున్న కాంగ్రెస్ కార్యకర్తలు
ఎర్రబెల్లి స్వర్ణ వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షురాలిగా ప్రమాణస్వీకారం చేస్తుండగా కొండా సురేఖ వర్సెస్ ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య గొడవ.
అలాగే కాంగ్రెస్(Congress) కార్యకర్తలకు కూడా కొండా మురళి పలు సూచనలు చేశారు.రాజకీయాల్లోకి కొత్తగా వచ్చే వాళ్లతో జాగ్రత్తగా ఉండాలని తమ కార్యకర్తలకు సూచించారు. వరంగల్ తూర్పు నుంచి గెలిచేది మాత్రం కొండా సురేఖనే అని స్పష్టం చేశారు. కార్యకర్తలకు మాత్రం ఏం జరిగినా వదిలిపెట్టనని వార్నింగ్ ఇచ్చారు. అంతర్గత విబేధాల నేపథ్యంలో ప్రస్తుతం కొండా మురళి చేసిన వ్యాఖ్యలు(Konda Murali Shocking Comments) చర్చనీయాంశమయ్యాయి.
వరంగల్ కాంగ్రెస్(Congress)లో అంతర్గత విభేదాలు భగ్గుమన్న సంగతి తెలిసిందే. జిల్లా అధ్యక్షురాలిగా ఎర్రబెల్లి స్వర్ణ(Yerrabelli Swarna)ను కాంగ్రెస్ పార్టీ నియమించింది. ఈ తరుణంలో బుధవారం ఎర్రబెల్లి స్వర్ణ ప్రమాణస్వీకారోత్సవం జరిగింది. ఆ సభ వద్ద కొండా మురళి(Konda Murali) , ఎర్రబెల్లి స్వర్ణ వర్గాల మధ్య విభేదాలు చెలరేగాయి. రెండు వర్గాలు ఒకరినొకరు దాడులు చేసుకున్నారు. ప్రమాణ స్వీకారానికి కొండా సురేఖను పిలవలేదంటూ ఆమె అనుచరులు ఫైర్ అయ్యారు. తీవ్ర వాగ్వాదాల మధ్య ఇరువర్గాలు చెప్పులతో దాడులు చేసుకున్నారు. ఈ ఘటన నేపథ్యంలో కొండా మురళి వార్నింగ్ ఇవ్వడం సంచలనం రేకెత్తిస్తోంది.